https://oktelugu.com/

Rajamouli Prabhas: ఇంత లైఫ్ ఇచ్చిన రాజమౌళితోనే తలపడుతున్న ప్రభాస్?

‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ చేశాడు రాజమౌళి. ఆ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ విశ్వవ్యాప్తమైంది. మొత్తం ప్యాన్ ఇండియా సినిమాలే ఆయన చేస్తున్నాడు. అయితే తనకు ఇంత లైఫ్ ఇచ్చిన రాజమౌళితోనే ప్రభాస్ తలపడబోతున్నాడా? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు.. అక్టోబర్13న దసరా కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ చేస్తాన్న రాజమౌళి ఇటీవల విడుదల తేదీని మళ్లీ వాయిదా వేశారు. ‘ఆర్ఆర్ఆర్ ’ విడుదల తేదీని చెప్పకుండా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2021 12:21 pm
    Follow us on

    ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రభాస్ ను ప్యాన్ ఇండియా స్టార్ చేశాడు రాజమౌళి. ఆ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ విశ్వవ్యాప్తమైంది. మొత్తం ప్యాన్ ఇండియా సినిమాలే ఆయన చేస్తున్నాడు. అయితే తనకు ఇంత లైఫ్ ఇచ్చిన రాజమౌళితోనే ప్రభాస్ తలపడబోతున్నాడా? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు..

    అక్టోబర్13న దసరా కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ చేస్తాన్న రాజమౌళి ఇటీవల విడుదల తేదీని మళ్లీ వాయిదా వేశారు. ‘ఆర్ఆర్ఆర్ ’ విడుదల తేదీని చెప్పకుండా సినీ ఇండస్ట్రీలోని ఇతర సినిమాలను నిర్మాతలను గందరగోళంలోకి నెట్టారు. ఆర్ఆర్ఆర్ వస్తే తట్టుకోవడం కష్టమని అగ్రహీరోలు, చిన్న హీరోలు కంగారుపుడుతున్నారు. కొత్త విడుదల తేదీని రాజమౌళి ప్రకటించాలని మేకర్స్ కోరుతున్నారు.

    అయితే తాజాగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తేనే బెటర్ అని డిసైడ్ అయ్యారట.. అప్పుడే దీనికి కలెక్షన్లు వస్తాయని.. సినిమా లాభాల బాట పడుతుందని ఆలోచిస్తున్నారట.. మిగతా ఎప్పుడు రిలీజ్ చేసినా సినిమాకు అంత లాభాలు రావని యోచిస్తున్నారట..ఈ క్రమంలోనే ఈ భారీ మెగా ఎపిక్ మూవీని 2022 జనవరి 12న విడుదల చేయడానికి రాజమౌళి డిసైడ్ అయినట్లు సమాచారం.

    ఇక కొత్త సంవత్సరం 2022లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన ‘గంగూభాయి’ మూవీ మొదటి సినిమాగా తొలుత థియేటర్లలోకి రానుంది. ఇది విడుదలయ్యాక వారం తర్వాత తన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ విడుదల చేసే పనిలో రాజమౌళి పడ్డారు.

    రాజమౌళి కుమారుడు కార్తికేయ ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ను సంక్రాంతి బరిలో నిలుపనున్నట్టు ‘సర్కారివారి పాట’, ఆచార్య, భీమ్లా నాయక్, ‘రాధేశ్యామ్’ నిర్మాతలకు తెలియజేసినట్టు సమాచారం.

    అయితే ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా యూనిట్ మాత్రం తమ సినిమాను వాయిదా వేసే అభ్యర్థనను పూర్తిగా తిరస్కరించినట్టు సమాచారం. కాబట్టి వచ్చే సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ మరియు, ‘ఆర్ఆర్ఆర్’ మధ్య ప్రత్యక్ష్య యుద్ధం సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మిగిలిన అన్ని సినిమాలు వాయిదా పడడం ఖాయంగా తెలుస్తోంది.

    రాజమౌళి తన చిత్రం యూనిట్ తో చాలా సమాలోచనలు చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రాజెక్ట్ కు ఇప్పటికే భారీగా ఖర్చు చేశామని.. 500 కోట్ల ఈ బడ్జెట్ ను తిరిగి పొందడానికి సంక్రాంతి పండుగ ఉత్తమ సమయం అని రాజమౌళి అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. విడుదల ఆలస్యం చేస్తే నిర్మాతపై భారం పడే ప్రమాదముందని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది.

    దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే కొత్త తేదీ గురించి ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తారని సమాచారం.