https://oktelugu.com/

RRR Movie: ఊహకందని రేంజ్​లో ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​.. గ్రాండ్​గా ట్రైలర్​ రిలీజ్​కు ఏర్పాట్లు

  RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 11:01 AM IST
    Follow us on

     

    RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం.

    RRR Movie

    ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్,టీజర్, పాటలు ప్రేక్షక అభిమానులలో ఈ మూవీ పై ఇంకాస్త భారీ అంచనాలు పెంచాయి. మరోవైపు డిసెంబరు 9న సినిమా ట్రైలర్​ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రైలర్ లాంచ్​ సహా ఇతర ప్రమోషన్స్​ అప్​డేట్స్​పై తాజాగా ఆసక్తికర విషయాలు తెలిశాయి.

    Also Read: రాజమౌళి కారణంగానే పవన్ ను పోటీలోకి దించుతున్నాడు !

    RRR Movie Komaram Bheem

    మొదట ఈ సినమా ట్రైలర్ లాంచ్​ గ్రాండ్​ ఈవెంట్​ను పీవీఆర్ ఓబ్రియో మాల్​ ముంబయిలో ఘనంగా ప్లాన్​ చేశారు. ఈ వేడుకకు రాజమౌళితోపాటు రామ్​చరణ్​, ఎన్టీరాఅ్, అజయ్ దేవగణ్​, ఆలియా భట్​లు పాల్గొననున్నట్లు సమాచారం. అదే సమయంలో ఉదయం 11గంటలకు ట్రైలర్​ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చెన్నై, బెంగళూరు సహా హైదరాబాద్​లో ప్రమోషన్స్​లో భాగంగా ఓ ప్రైవేట్​ ఫ్లైట్​నే హైర్ చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్స్​ను ఊహకందని రేంజ్​లో ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది.

     

    Also Read: అరెరే.. ‘పుష్ప’లో ఆ కళ మిస్ అయిందే !