RRR: సినీ ప్రియులు “ఆర్ఆర్ఆర్” కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, జనవరిలో జనాలను అలరించడానికి ఆర్ఆర్ఆర్ ముస్తాబు అవుతుంది. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడం, జక్కన్న దర్శకుడు కావడంతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ చిత్రంపై భారీ అంచనాలను పెట్టుకుంది. ఇక ఈ సినిమాను జనవరి 7న విడుదల చేయడానికి టీమ్ తగిన ఏర్పాట్లు చేసుకుంటుంది.

మరి ఈ నేపథ్యంలో జక్కన్న మళ్ళీ ప్రమోషన్స్ లో వేగం పెంచుతాడేమో చూడాలి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్, టీజర్లు, అలాగే ఫస్ట్ సింగిల్ బాగున్నాయి. సినిమా పై అంచనాలను మరింతగా పెంచాయి. కానీ ఇవి విడుదలై చాలా రోజులు అవుతుంది. ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర టీజర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా మెయిన్ టీజర్ ను అక్టోబర్ 29న రిలీజ్ చేయబోతున్నారట. మొత్తానికి రాజమౌళి మళ్ళీ పబ్లిసిటీ మీద పడినట్టు ఉన్నాడు. ముఖ్యంగా డిసెంబర్ లో పబ్లిసిటీలో భాగంగా ఓ చార్టర్ ఫ్లయిట్ ను వివిధ సిటీలకు వెళ్లేందుకు రెడీ చేసుకుంటున్నారట.
ముంబాయి,బెంగళూరు, హైదరాబాద్, చెన్నయ్, విశాఖపట్నం లో సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లు, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లు చేయడానికి తగిన ప్రణాళికలు రాజమౌళి టీమ్ ఇప్పటికే రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. ఇక బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ మీద కూడా ఎక్కువ ఖర్చు పెట్టి.. సినిమాను జనంలోకి తీసుకువెళ్లారట. ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్న సినిమా.
పైగా అన్ని చోట్లా బారీ రేట్లు పలుకుతుంది. ఇలాంటి పరిస్తుతుల్లో మంచి ప్రమోషన్స్ కూడా తోడు అయితే సినిమా జనంలోకి వెళ్తుంది. ఎలాగూ.. రిలీజ్ కి అనుకూలంగా ఉన్న సమయంలోనే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. దానికి తగ్గట్టు ప్రమోషన్స్ ను కూడా గట్టిగా ప్లాన్ చేస్తే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయి.