https://oktelugu.com/

ఆర్ఆర్ఆర్ ‘సీత’ పెళ్లికి ముస్తాబైంది !

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆమె ప్రియుడు రణబీర్ ని వివాహం ఆడేందుకు రెడీ ఆయింది. నేడు రణబీర్ కపూర్ తో అలియా భట్ నిశ్చితార్థం రణతంబోర్ (జైపూర్)లో జరగనుందని బాలీవుడ్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏమిటంటే.. మంగళవారం ఉదయం.. రణబీర్ కపూర్.. అలియా భట్ ముంబై విమానాశ్రయంలో రణబీర్ తల్లి నీతు సింగ్ తో కలిసి జైపూర్ బయలుదేరింది నిశ్చితార్థం కోసమే అని.. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా చేసుకున్నారని […]

Written By: , Updated On : December 30, 2020 / 01:06 PM IST
Follow us on

Alia Bhatt
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఆమె ప్రియుడు రణబీర్ ని వివాహం ఆడేందుకు రెడీ ఆయింది. నేడు రణబీర్ కపూర్ తో అలియా భట్ నిశ్చితార్థం రణతంబోర్ (జైపూర్)లో జరగనుందని బాలీవుడ్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల సారాంశం ఏమిటంటే.. మంగళవారం ఉదయం.. రణబీర్ కపూర్.. అలియా భట్ ముంబై విమానాశ్రయంలో రణబీర్ తల్లి నీతు సింగ్ తో కలిసి జైపూర్ బయలుదేరింది నిశ్చితార్థం కోసమే అని.. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా చేసుకున్నారని తెలుస్తోంది. అన్నట్లు ఈ నిశ్చితార్థం కోసమని రణవీర్ సింగ్ -దీపికా పదుకొనే కూడా పింక్ సిటీకి బయలుదేరారు.

Also Read: ఆయనకే హిట్ లేదు.. ఆయనేం హిట్ ఇస్తాడు !

అలాగే మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులు కూడా వెళ్లారు. వాళ్ళల్లో
మహేష్ భట్ – రిద్దిమా కపూర్ – ఆదర్ జైన్- కరణ్ జోహార్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. నిన్న గోవాలో దిగి తెల్లవారుజామున విమానంలో నగరంలో బయల్దేరి జైపూర్ వెళ్లారట. ఫోటోల్ని పరిశీలిస్తే.. విమానాశ్రయంలో రణబీర్ కపూర్- అలియా- నీతు సింగ్ -రిద్దిమా కపూర్ కనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే మొదట `వీరంతా రణతంబోర్ అమన్ హోటల్ లో దిగడంతో.. బహుశా న్యూ ఇయర్ హాలీడే అని అనుకున్నారు అందరూ. కానీ ఆర్కె – అలియా దగ్గరి స్నేహితులంతా హాజరవుతుంటే.. ఇక వీరి నిశ్చితార్థం చేసుకుంటున్నారని అందరూ ఫిక్స్ అయ్యారు. ఈ రోజు హోటల్లో క్లోజ్డ్ ఎంగేజ్మెంట్ వేడుక జరగవచ్చని ఇన్ సైడ్ వర్గాల సమాచారం.

Also Read: ఎన్టీఆర్ కి విలన్ గా సూపర్ స్టార్ ఫిక్స్ !

ఇక అలియా భట్ “ఆర్.ఆర్.ఆర్” సినిమా షూటింగ్ లో రీసెంట్ గా పది రోజుల పాటు పాల్గొన్న సంగతి తెలిసిందే. అలాగే జనవరిలో జరగనున్న రెండో షెడ్యూల్లో రామ్ చరణ్, అలియా పై ఒక రొమాంటిక్ సాంగ్, సీన్లను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే “ఆర్.ఆర్.ఆర్” లాస్ట్ షెడ్యూల్ పూర్తి కాగానే ఆలియా వెంటనే ముంబై వెళ్ళి.. అక్కడి నుంచి తన ప్రియుడు రణబీర్ కపూర్ తో కలిసి గోవా వెళ్ళి ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా మొన్న బాగా వైరల్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్