https://oktelugu.com/

రజనీ యూటర్న్‌కు కారణం ఇదా..?

ఈ నెలలోనే ఎంతో ఇంట్రెస్టింగ్‌గా రాజకీయాల్లోకి వస్తున్నానంటూ.. త్వరలో పెట్టబోతున్నట్లు తమిళ సూపర్‌‌స్టార్‌‌ రజినీకాంత్‌ ప్రకటించారు. ఆ వెంటనే షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ప్రధానంగా బీపీ సమస్యతో నగరంలోని ఓ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. కొద్ది రోజులకు డిశ్చార్చి అయిన రజనీ.. పార్టీ ప్రకటించే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఇది తమిళనాడులో హాట్‌ టాపిక్‌ అయింది. Also Read: ‘తలైవా’ వెనక్కి.. ‘దళపతి’ ముందుకు..! అనారోగ్య కారణాలు, కుటుంబ సభ్యుల విముఖత […]

Written By: , Updated On : December 30, 2020 / 01:02 PM IST
Follow us on

Rajinikanth
ఈ నెలలోనే ఎంతో ఇంట్రెస్టింగ్‌గా రాజకీయాల్లోకి వస్తున్నానంటూ.. త్వరలో పెట్టబోతున్నట్లు తమిళ సూపర్‌‌స్టార్‌‌ రజినీకాంత్‌ ప్రకటించారు. ఆ వెంటనే షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ప్రధానంగా బీపీ సమస్యతో నగరంలోని ఓ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. కొద్ది రోజులకు డిశ్చార్చి అయిన రజనీ.. పార్టీ ప్రకటించే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఇది తమిళనాడులో హాట్‌ టాపిక్‌ అయింది.

Also Read: ‘తలైవా’ వెనక్కి.. ‘దళపతి’ ముందుకు..!

అనారోగ్య కారణాలు, కుటుంబ సభ్యుల విముఖత కారణంగా రజనీకాంత్ రాజకీయాల ఆరంగేట్రం చేయకముందే వైదొలుగుతున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ, అనధికార కారణాలు వేరే ఉన్నట్లుగా తమిళనాట రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే తమిళనాట రజనీకాంత్‌ను ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి రాజకీయాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పట్లో కాంగ్రెస్ పతనావస్థలో ఉన్న కారణంగా ఇటు రజిని, అటు చిరంజీవి ఇద్దరు కూడా పీవీ నరసింహారావు ఆఫర్‌‌ను సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత చిరంజీవి అనువు గాని సమయంలో రాజకీయాల్లోకి వచ్చి విఫలమైతే, రజనీకాంత్ ఇప్పుడు అప్పుడు అంటూ ఊరిస్తూ దశాబ్దాల పాటు కాలం వెళ్లదీశారు.

Also Read: రాజకీయాల్లోకి రాను.. రజినీకాంత్ సంచలన ప్రకటన.. కారణం ఇదే!

జయలలిత మరణాంతరం మళ్లీ రాజకీయ ప్రవేశం పట్ల అభిమానుల్లో ఆశలు రేకెత్తించిన రజనీకాంత్ చివరికి అనారోగ్య కారణాలతో రాజకీయ ప్రవేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. అధికారికంగా కారణాలు ఇలా ఉన్నప్పటికీ, అనధికారికంగా ఇతర అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రజనీ స్వయంగా చేయించుకున్న సర్వేలలో ప్రతికూల ఫలితాలు రావడం, బీజేపీకి మద్దతుగా నిలవడానికి అభిమానులు ఒప్పుకోకపోవడం, వంద రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించడానికి ఆరోగ్యం సహకరించకపోవడం, నిధుల లేమి వంటి అనేక కారణాల వల్లే రజినీకాంత్ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

ఇటీవల రజనీకాంత్ కొన్ని సంస్థలతో చేయించుకున్న సర్వేలలో తీవ్ర నిరాశ కలిగించే ఫలితాలే వచ్చాయట. ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి 17 శాతం ఓట్లు, 18 సీట్లు వస్తే, పవన్ కళ్యాణ్ సమయానికి సినీతారల పట్ల క్రేజ్ మరింతగా తగ్గి ఏడు శాతం ఓట్లు ఒక సీటు మాత్రమే వచ్చింది. అటు తమిళనాట కమల్ హాసన్ విజయ్ కాంత్ వంటి సినీ తారలకు కూడా అంత కంటే ఘోరమైన ఫలితాలు ఇటీవలి కాలంలో వచ్చాయి. ఈ నేపథ్యంలో రజనీ పార్టీకి ఫలితాలు భిన్నంగా ఉంటాయని ఎవరూ భావించడం లేదు. రజినీకాంత్ అంతర్గతంగా చేయించుకున్న సర్వేలలో కూడా ఇదే తేలినట్లుగా తెలుస్తోంది. 234 స్థానాల్లో కేవలం 10-–15 స్థానాల్లో మాత్రమే రజినీకాంత్ ఎంతో కొంత ప్రభావం చూపగలడని, రజినీకాంత్ స్థాపించే పార్టీ 1-2 స్థానాల్లో గెలవడం కూడా కష్టమే అని, తాను స్వయంగా గెలవడమూ అనుమానమే అని సర్వేలో తేలడమే రజనీ యూ టర్న్‌కు ప్రధాన కారణం అనే వాదన తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది.