https://oktelugu.com/

RRR Movie Update: ఆర్ఆర్ఆర్ నుంచి మరో కీలక అప్డేట్.. హమ్మయ్య రాజమౌళి బతికించావయ్యా

RRR Movie Update: ఒక సంవత్సరం అన్నాడు.. ఆ తర్వాత రెండేళ్లు.. ఇప్పుడు మూడేళ్లు.. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవ్ గణ్, ఆలియాభట్ లాంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీపై దేశవ్యాప్తంగా బోలెడు అంచనాలున్నాయి. అభిమానులు వేయికళ్లతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్, ప్రమోషన్ సాంగ్స్ సోషల్ మీడియాలో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 26, 2021 / 04:52 PM IST
    Follow us on

    RRR Movie Update: ఒక సంవత్సరం అన్నాడు.. ఆ తర్వాత రెండేళ్లు.. ఇప్పుడు మూడేళ్లు.. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవ్ గణ్, ఆలియాభట్ లాంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీపై దేశవ్యాప్తంగా బోలెడు అంచనాలున్నాయి. అభిమానులు వేయికళ్లతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

    ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్, ప్రమోషన్ సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలను ఒకేసారి స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా గతంలో చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

    తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ దేశంలో మిగిలిన పాటలు పూర్తి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం ఎట్టకేలకు గొప్ప అప్డేట్ చెప్పింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తయ్యిందని అధికారికంగా తెలిపారు. కొన్ని పికప్ షాట్స్ మినహా మిగతా షూట్ పూర్తి చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపింది.

    2018 నవంబర్ 19న ప్రారంభించిన అదే బైక్ షాట్ తో అనుకోకుండా ఈరోజు ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యిందంటూ చిత్రం యూనిట్ ట్వీట్ చేసింది. ఈ సినిమా అప్ డేట్స్ త్వరలోనే ఇవ్వబోతున్నట్టుగా ఆర్ఆర్ఆర్ టీం తెలిపింది.

    https://twitter.com/RRRMovie/status/1430822280666308614?s=20