https://oktelugu.com/

RRR Movie: “ఆర్ఆర్ఆర్” ప్రీమియర్ షో.. టికెట్ రేటు ఎంతంటే ?

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 25వ తేదీన రాబోతుంది. బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ఇది. పైగా ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. ఈ సినిమా టికెట్ రేట్లు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త బలంగా వినిపిస్తోంది. ఆ వార్త సారాంశం ఏమిటంటే.. “ఆర్ఆర్ఆర్” ప్రీమియర్ షోల కోసం భారీ ఎత్తున రంగం సిద్ధం చేస్తున్నారు. “ఆర్ఆర్ఆర్” సినిమా తొలి రోజు ప్రీమియర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 20, 2022 / 05:29 PM IST
    Follow us on

    RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 25వ తేదీన రాబోతుంది. బలమైన నేపథ్యం ఉన్న రెండు సినీ కుటుంబాల వారసులు కలిసి నటించిన సినిమా ఇది. పైగా ఇద్దరి హీరోలకూ భారీ మాస్ ఇమేజ్ ఉంది. ఈ సినిమా టికెట్ రేట్లు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త బలంగా వినిపిస్తోంది. ఆ వార్త సారాంశం ఏమిటంటే.. “ఆర్ఆర్ఆర్” ప్రీమియర్ షోల కోసం భారీ ఎత్తున రంగం సిద్ధం చేస్తున్నారు.

    RRR Movie

    “ఆర్ఆర్ఆర్” సినిమా తొలి రోజు ప్రీమియర్ షోను నభూతో, న భవిష్యత్ అనేలా ప్రదర్శించాలని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. దీన్ని చిత్రబృందం కూడా బాగా క్యాష్ చేసుకోబోతుంది. ముఖ్యంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్ లో ముందుగానే అర్ధరాత్రి 1 గంటలకు ఆర్ఆర్ఆర్ షో స్టార్ట్ కానుంది.

    Also Read: Prabhas Radhe Shyam: సినిమా కొనుకున్న వాళ్ళు అన్యాయం అయిపోయారు

    పైగా టికెట్ రేటు 5 వేలు అని తెలుస్తోంది. కారణం.. భ్రమరాంబ థియేటర్ షోకి ఎన్టీఆర్ – చరణ్ హీరోలిద్దరూ హాజరవుతున్నారు. అందుకే.. ఫ్యాన్స్ భ్రమరాంబ థియేటర్ షో కోసం ఎగబడుతున్నారు. ఈ డిమాండ్ ను అర్థం చేసుకున్న థియేటర్ యాజమాన్యం మొత్తానికి ఎన్నడూ లేని విధంగా టికెట్ ప్రైజ్ ను అమాంతం పెంచేసింది.

    అలాగే మిగిలిన ఏరియాల్లో కూడా ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోల కోసం గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొందరు అభిమానులు సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రీమియర్ షోలను ఆడిస్తున్నారు. మరోపక్క బుకింగ్స్ స్టార్ట్ అయిన గంటకే టికెట్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది.

    RRR Movie

    పైగా నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రస్తుతం భారీ రికార్డ్స్ ను క్రియేట్ చేయడానికి సిద్ధం అయ్యింది. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్యాన్‌ ఇండియా మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

    Also Read: The Kashmir Files: డోంట్ మిస్.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది

    Tags