Victory Venkatesh New Movie: కొత్త కాంబినేషన్.. మరి వర్కౌట్ అవుతుందా ?

Victory Venkatesh New Movie: కొన్ని కాంబినేషన్స్ వినడానికి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి కలయిక గురించి ఈ రోజు ఉదయం నుంచి ఒక్కటే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరిదీ ఈ కాంబినేషన్ అంటే.. హీరో వెంకటేష్ – ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ లది. వెంకటేష్ ఇప్పటికే ఈ కలయికలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ F3 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఒక వెబ్‌సిరీస్ […]

Written By: Shiva, Updated On : March 20, 2022 6:44 pm
Follow us on

Victory Venkatesh New Movie: కొన్ని కాంబినేషన్స్ వినడానికి కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి కలయిక గురించి ఈ రోజు ఉదయం నుంచి ఒక్కటే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరిదీ ఈ కాంబినేషన్ అంటే.. హీరో వెంకటేష్ – ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ లది. వెంకటేష్ ఇప్పటికే ఈ కలయికలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

venkatesh-anudeep

ప్రస్తుతం వెంకీ F3 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఒక వెబ్‌సిరీస్ చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ దర్శకత్వంలో సినిమా చేయడానికి వెంకటేష్ ఎందుకు అంగీకారం తెలిపాడు ? కారణం ఏమై ఉంటుంది ? పైగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మైంట్స్ బ్యానర్‌ నిర్మించబోతుంది అని టాక్ నడుస్తోంది.

Also Read: Prabhas Radhe Shyam: సినిమా కొనుకున్న వాళ్ళు అన్యాయం అయిపోయారు

ఇక విక్టరీ వెంకటేశ్ కూడా ఓటీటీ ప్లాట్‌‌ఫాంలో హోస్టుగా అలరించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ‘ఆహా’లో వచ్చిన అన్‌స్టాపబుల్ టాక్ షో లాగే.. అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం ఓ సరికొత్త ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నారని.. ఆ ప్రోగ్రామ్ కి వెంకటేశ్ హోస్ట్‌ గా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రాబోతుందట. ఇక వెంకటేష్ లాస్ట్ సినిమా దృశ్యం 2. ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాగా ఆకట్టుకున్న ‘దృశ్యం’ నుంచి సీక్వెల్‌ గా వచ్చిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ లో వెంకటేష్ సరసన మీనా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఓటీటీ బాట పట్టి.. డిజిటల్ ఆడియన్స్‌ ను బాగా ఆకట్టుకుంది.

venkatesh-anudeep

మొత్తానికి వెంకీ బాలయ్యను ఫాలో అవుతున్నాడు. అయితే వెంకీ, బాలయ్య స్థాయిలో సక్సెస్ అవుతాడా ? నిజానికి ఇండియన్ ఓటీటీ షోలలోనే బాలయ్య షో నంబర్ వన్ షో అయింది. బాలయ్య నెంబర్ వన్ హోస్ట్ గా కూడా నిలిచాడు. మరి ఈ స్థాయిలో వెంకీ సక్సెస్ అవుతాడా ? చూడాలి.

Also Read: The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ కి న్యూజిలాండ్ లో ఆటంకాలు

Tags