https://oktelugu.com/

Mahesh- Rajamouli Movie: మహేష్ తో చేస్తున్న సినిమా పై రాజమౌళి క్లారిటీ

Mahesh Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం మల్టీస్టారర్ కాన్సెప్ట్‌ ను సిద్ధం చేశాడని వస్తున్న వార్తలపై జక్కన్న ఆర్ఆర్ఆర్ ఈవెంట్లో తాజాగా క్లారిటీ ఇచ్చారు. మహేష్ తో చేయబోతున్న సినిమా మల్టీస్టారర్ కాదని, ఆ సినిమాలో మహేష్ బాబు ఒక్కడే హీరో అని రాజమౌళి స్పష్టం చేశాడు. ఇక ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 20, 2022 / 04:55 PM IST
    Follow us on

    Mahesh Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం మల్టీస్టారర్ కాన్సెప్ట్‌ ను సిద్ధం చేశాడని వస్తున్న వార్తలపై జక్కన్న ఆర్ఆర్ఆర్ ఈవెంట్లో తాజాగా క్లారిటీ ఇచ్చారు. మహేష్ తో చేయబోతున్న సినిమా మల్టీస్టారర్ కాదని, ఆ సినిమాలో మహేష్ బాబు ఒక్కడే హీరో అని రాజమౌళి స్పష్టం చేశాడు.

    Rajamouli-Mahesh Babu

    ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది ? అని మహేష్ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఎలాగూ, “ఆర్ఆర్ఆర్” ఈ నెలాఖరున విడుదల కానుంది. అంటే వచ్చే నెల నుంచి రాజమౌళి ఫ్రీ అయిపోతాడు. మరి వెంటనే మహేష్ తో సినిమా స్టార్ట్ చేస్తాడా ? లేక, ఎప్పటిలాగే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంటాడా ? అనేది చూడాలి.

    ఇప్పటికి అయితే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందట. కాకపోతే, రాజమౌళి పూర్తి అయిన స్క్రిప్ట్ పై కూడా వర్క్ చేయడానికి ఆరు నెలలు టైం తీసుకుంటాడు. ఆ తర్వాత మహేష్ బాబు ఎప్పుడు డేట్స్ ఇవ్వగలడో తెలుసుకొని అప్పుడు సినిమా షూట్ ను ప్లాన్ చేస్తాడట. కాబట్టి.. ఇదంతా సెట్ కావాలంటే మరో ఏడాది అయినా పడుతుంది అంటున్నారు సినీ జనం.

    అందుకే, రాజమౌళి తన కెమెరామన్ సెంథిల్ ని వేరే సినిమా చేసుకోమని సలహా ఇచ్చాడు. ప్రస్తుతం సెంథిల్ ఒక కన్నడ – తెలుగు చిత్రాన్ని టేకప్ చేశాడు. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు హీరోగా వస్తున్న సినిమాకి సెంథిలే కెమెరామెన్. ఎలాగూ మహేష్ బాబు – రాజమౌళి సినిమాకి మరో ఏడాది సమయం ఉంది కాబట్టి.. ఈ లోపు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు సినిమాను పూర్తి చేస్తాడట సెంథిల్.

    Rajamouli-Mahesh Babu

    ఆ తర్వాత మహేష్ – రాజమౌళి సినిమా మీదకు రానున్నాడు. మొత్తమ్మీద మహేష్ – రాజమౌళి సినిమా కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందే. ఇక మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్‌ ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో కథ రాశారని.. ఆ ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుందని గతంలో వార్తలు వినిపించాయి.

    ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారని.. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి క్రమంలో ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.

    Tags