https://oktelugu.com/

RRR: రికార్డుల వేట మొదలుపెట్టిన ‘ఆర్​ఆర్​ఆర్​’.. 100 మిలియన్ల వ్యూస్​కు చేరుకున్న ట్రైలర్​

RRR: బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​, జూనియర్​ ఎన్టీఆర్​ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వరుసగా పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్​. ఈ సినిమాలో తారక్​, చెర్రీలు మునుపెన్నడూ కనిపించని విభన్న పాత్రల్లో నటిస్టుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 11:02 AM IST
    Follow us on

    RRR: బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ఆర్​ఆర్​. మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​, జూనియర్​ ఎన్టీఆర్​ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వరుసగా పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్​. ఈ సినిమాలో తారక్​, చెర్రీలు మునుపెన్నడూ కనిపించని విభన్న పాత్రల్లో నటిస్టుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ క్యూరియాసిటీ పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్​ ఒక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. యాక్షన్స్​, ఎమోషన్స్​, ఎలివేషన్స్​ ఇలా అన్నింట్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది ట్రైలర్​.

    RRR Team

    Also Read: ఫస్ట్ టైమ్ ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఆ పని చేస్తున్న తారక్… ఏంటి అంటే

    విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. హిందీలోనూ అదే రేంజ్​లో వ్యూస్​ను దక్కించుకుంది ఈ ట్రైలర్​. అయితే, తాజాగా ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్ అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. విడుదలైన ఆరు రోజుల్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్​ సొంతం చేసుకున్న తొలి ట్రైలర్​గా చరిత్రను తిరగరాసింది. అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్లు దాటేసింది ఆర్ఆర్ఆర్​ ట్రైలర్​.

    ఈ క్రమంలోనే భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా ఆర్​ఆర్​ఆర్ నిలిచింది. విడుదలకుముందే రికార్డుల వేట ప్రారంభించిన ఈ సినిమా.. ఇక థియేటర్లలోకి వస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అలియాభట్​తో పాటు, అజయ్​దేవగణ్​, శ్రియ, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సముద్రఖని కూడా నటిస్తున్నారు.

    Also Read: రామ్ చరణ్‌ తో మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి…