Perni Nani: ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల శాఖల్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాదు. ఏ మంత్రి ఏ శాఖ నిర్వహిస్తున్నారో కూడా వారికి అనుమానమే కలుగుతుంది. దీంతో తాము ఏ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నామో అనే సందేహాలు వారిలో రావడం సహజమే. ఇన్నాళ్లు సినిమాలకు సంబంధించిన శాఖను పేర్నేని నాని చూశారు. కానీ నిన్న సినిమాటోగ్రీఫీ శాఖ మంత్రిగా పేర్ని నానికి అప్పగిస్తున్నట్లుగా ప్రకటన రావడం అందరిలో ఆశ్చర్యం కలిగించింది.
ఇప్పటివరకు సినిమాలకు సంబంధించిన వ్యవహారాలన్ని ఆయనే చూశారు. తాజాగా ఈ ప్రకటన రావడంతో అందరిలో ఒక్కసారి వింతగా అనిపించింది. కానీ ఇది ముమ్మాటికి నిజమే. ఏపీలో ఎవరు ఏ శాఖలు నిర్వహిస్తున్నారో వారికే అంతుబట్టదు. ఎవరి సమాచారం ఎవరో చెబుతారు. కానీ దానికి సంబంధించిన శాఖ మంత్రికి కూడా తెలియదు. ఇలాంటి విచిత్రకర సన్నివేశాలు చోటుచేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను తానే చూసుకున్నారు నాని. కానీ ఇప్పుుడు కొత్తగా సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రకటన రావడం వెనుక ఏం దాగి ఉన్నదో ఎవరికి అర్థం కావడం లేదు. ఇన్నాళ్లు ఈ శాఖ సీఎం వద్దనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు అనధికారికంగా బాధ్యతలు నిర్వహించిన నానికి కొత్తగా ఈ శాఖ అప్పగిస్తున్నట్లు దాని సారాంశమని చెబుతున్నారు.
Also Read: Movie Ticket Rates: టికెట్ రేట్లపై నేడే విచారణ.. జగన్ సర్కార్ పంతం నెగ్గుతుందా..?
అయితే ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో అన్ని అనుమానాలే వస్తాయి. అలాంటిది సినిమాటోగ్రఫీ విషయంలో కూడా ఇన్నాళ్లు కొనసాగిన సస్పెన్స్ తీరిపోయిందని భావిస్తున్నా ఏపీలో కొనసాగుతున్న విచిత్ర పరిస్థితులు అందరిలో అనేక అనుమానాలకు తెరతీస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందో అనే దానిపైనే స్పష్టత కానరావడం లేదు. ఏదిఏమైనా ఇప్పటికైనా సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రిని కేటాయించినందుకు సినిమా రంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
Also Read: Chandrababu Pawan: చంద్రబాబు, పవన్ మళ్లీ కలవబోతున్నారోచ్!