RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. టాలీవుడ్ స్టార్ హీరోల అయినా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ అలానే హాలీవుడ్ యాక్టర్ ఓలివియా మోరీస్, శ్రీయ శరణ్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం.

BIG DAY !! Theatres will erupt in few hours…. 🌋🌋💥💥#RRRTrailerDay #RRRTrailer #RRRMovie pic.twitter.com/TEb5BPCgaL
— RRR Movie (@RRRMovie) December 9, 2021
ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్,టీజర్, పాటలు ప్రేక్షక అభిమానులలో ఈ మూవీ పై ఇంకాస్త భారీ అంచనాలు పెంచాయి. మరోవైపు డిసెంబరు 9న సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పలు థయేటర్లలో ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది సినిమా టీమ్. ఉదయం 10 గంటలకు ఈ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన చరణ్, తారక్ అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెంచిందని అంటున్నారు. కాగా, ఈ ట్రైలర్‌ను సాయంత్రం సోషల్‌మీడియాలో రిలీజ్ చేయనున్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో ఇవే హైలైట్స్.. ఇవి 5 గమనించారా?
భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా.. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. తారక్ జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.
Also Read: ఫస్ట్ఆఫ్ మొత్తం తారక్.. సెకండ్ ఆఫ్‌లో రామ్ బీభత్సం.. ట్రైలర్లో రాజమౌళి చెప్పింది ఇదేనా?