RRR Item Song: దేశమొత్తం ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న ఈ మూవీ భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్లు, పాటలకు మంచి స్పందన వచ్చింది.తాజాగా ‘జనని’ పాటతో దేశభక్తిని ఉప్పొంగేలా చేసింది ఆర్ఆర్ఆర్ టీం. ఆ పాట వైరల్ అయ్యింది. అంతకుముందు ‘నాటు నాటు’ సాంగ్ అయితే దేశాన్ని ఊపేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
Also Read: హీరో రాజశేఖర్ ఆ మూవీలు చేసి ఉంటేనా?

జనవరి 7వ తేదీన రిలీజ్ కు రెడీ అయిన ‘ఆర్ఆర్ఆర్’ టీం ప్రమోషన్ ను హీటెక్కిస్తోంది. ఈ క్రమంలోనే ఒక్కోపాటను రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. రాంచరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, ఆలియా భట్ లాంటి స్టార్లు, హాలీవుడ్ భారీ తారాగణంతో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఇక నాటునాటు ఊపేయగా.. ‘జననీ సాంగ్’ దేశభక్తిని ఉప్పొంగించేలా చేసి జనాలను ఎమోషన్ కు గురిచేసింది. ఈ క్రమంలోనే ఓ తుంటరి తెలుగు నెటిజన్.. ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ ను ట్యాగ్ చేస్తూ ఓ చిలిపి ప్రశ్న సంధించాడు. ‘ఆర్ఆర్ఆర్ సినిమాలో ఐటెం సాంగ్ ఉందా మావా’ అని ప్రశ్నించాడు. అలా ఎందరో ఎన్నో అడిగినా స్పందించని ‘ఆర్ఆర్ఆర్’ టీం ఈ తుంటరి ప్రశ్నకు మాత్రం స్పందించింది.
‘ఏ నువ్వు చేస్తావా?’ అంటూ నెటిజన్ కు పంచ్ ఇస్తూ సమాధానం ఇచ్చింది. ఇది నవ్వులు పూయించింది. పైగా ఈ పంచ్ కు బ్రహ్మానందం మీమ్ ను పెట్టిన నెటిజన్ కు అదే బ్రహ్మానందం మీమ్ తో ఆర్ఆర్ఆర్ టీం సమాధానం ఇవ్వడం విశేషం. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన చిలిపి ప్రశ్నకు ఆర్ఆర్ఆర్ టీం స్పందించడంతో ఆ నెటిజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తుంటరి ట్వీట్ ను మీరూ కింద చూసి ఎంజాయ్ చేయండి.
Ye Nuvvu Chesthaaavaa… pic.twitter.com/d2xoLHParR
— RRR Movie (@RRRMovie) November 26, 2021
Also Read: షణ్ముక్ తో రోమాన్స్.. సిరి తన బాయ్ ఫ్రెండ్ ను వదిలేసిందా?