RRR మూవీ బిగ్ బ్రేకింగ్.. ఎన్టీఆర్ క‌ళ్లు పీకేస్తాడ‌‌ట‌.. రామ్ చ‌ర‌ణ్ కాళ్లు తీసేస్తాడ‌‌ట‌!

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం రణం రుధిరం రౌద్రం(ఆర్ఆర్ఆర్). దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. డీవీవీ దాన‌య్య ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒక‌టి ఫిల్మ్ న‌గ‌ర్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. సాధార‌ణంగా రాజ‌మౌళి సినిమాల్లో హీరో పాత్ర‌లు ఎంత వీరోచితంగా ఉంటాయో తెలిసిందే. అత్యంత […]

Written By: Bhaskar, Updated On : March 7, 2021 2:18 pm
Follow us on


ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం రణం రుధిరం రౌద్రం(ఆర్ఆర్ఆర్). దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నారు. డీవీవీ దాన‌య్య ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒక‌టి ఫిల్మ్ న‌గ‌ర్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

సాధార‌ణంగా రాజ‌మౌళి సినిమాల్లో హీరో పాత్ర‌లు ఎంత వీరోచితంగా ఉంటాయో తెలిసిందే. అత్యంత బలవంతుడైన ప్రతినాయకుడి మీద ‘‘నా హీరో పోరాడాలి’’ అంటాడు రాజమౌళి. తెరపై ఆయ‌న హీరోలు కూడా అలాగే పోరాటం చేస్తుంటారు. ఫైన‌ల్ గా అద్భుత‌మైన హీరోయిజాన్ని చూపించి, సినిమాకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌క్క‌న్న చెక్కిన చిత్రాల‌న్నీ ఇలాగే ఉన్నాయి.

Also Read: బాక్సాఫీస్ వ‌ద్ద.. ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ స్పీడు ఎంతంటే?

కానీ.. RRR లెక్క మాత్ర మ‌రోలా ఉండబోతోంద‌ని స‌మాచారం. ఈ సినిమాకు ట్రాజెడీ ముగింపు ఇవ్వబోతున్నాడట రాజమౌళి. అంటే.. ఆయ‌న హీరోలు చ‌నిపోవ‌ట్లేదుగానీ.. ఆ పాత్ర‌లు రెండూ అంగ‌వైక‌ల్యం పొందుతాయ‌ని టాక్‌. ఇదే RRR క్లైమాక్స్ అని తెలుస్తోంది. బ్రిటీష్ వారితో సేన‌ల‌తో జ‌రిగే పోరాటంలో హీరోలిద్ద‌రూ ఇలా వైక‌ల్యానికి గుర‌వుతార‌ని స‌మాచారం.

Also Read: క‌లెక్ష‌న్ల ‘ఉప్పెన’.. 100 కోట్ల పోస్ట‌ర్ వ‌దిలారుగా!

ఇందులో భాగంగా.. ఎన్టీఆర్ క‌ళ్లు కోల్పోతుండ‌గా.. రామ్ చ‌రణ్ కాళ్లు కోల్పోతార‌ని స‌మాచారం. ఈ విష‌య‌మై సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే.. ఇది నిజ‌మే కావొచ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అగ్ర‌హీరోలిద్ద‌రికి సంబంధించిన‌ ఇలాంటి ఎండింగ్ ను తెర‌పై చూస్తే అభిమానులు హ‌ర్ట్ అవుతార‌నే ఉద్దేశంతో ముందస్తుగా వారిని ప్రిపేర్ చేసేందుకు ఈ లీక్ ఇచ్చార‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

సినిమా విడుద‌ల కావ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ఉండ‌డంతో.. ఈ లోగా ఈ విషాద స‌న్నివేశాన్ని జీర్ణించుకొని, అభిమానులు మాన‌సికంగా సిద్ధ‌మై థియేట‌ర్ కు వ‌స్తార‌నే ఆలోచ‌న‌లో భాగంగానే ఈ క్లైమాక్స్ లీక్ చేసిన‌ట్టు స‌మాచారం. స్వ‌తంత్ర పోరాటానికి సంబంధించిన సినిమా కాబ‌ట్టి.. భావోద్వేగంతో ప్రేక్ష‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చేలా సినిమాను ముగించ‌బోతున్నాడ‌ట రాజ‌మౌళి. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది చూడాలి. ద‌స‌రా కానుక‌గా ఈమూవీ అక్టోబ‌రు 13న రిలీజ్ కాబోతోంది.