Homeఎంటర్టైన్మెంట్RRR Movie: నాటు నాటు అంటూ దుమ్ము రేపుతున్న... రామ్, రామారావు

RRR Movie: నాటు నాటు అంటూ దుమ్ము రేపుతున్న… రామ్, రామారావు

RRR Movie: దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్”. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.

rrr movie second song natu natu released by movie team

ఈ చిత్రం నుంచి తాజాగా రెండవ పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. కాగా నాటు నాటు అంటూ సాగే ఈ మాస్ సాంగ్ లో తారక్, చెర్రీ దుమ్ము లేపారు అని చెప్పాలి. స్వతహాగానీ మంచి డాన్సర్స్ అయిన వీరిద్దరు కలిసి ఈ పాటలో అభిమానులకు ఓ రేంజ్ ట్రీట్ ఇచ్చారు. మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ల ఎనర్జీ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి.  అలాగే… లిరిక్స్‌ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.

Naatu Naatu Song (Telugu)| RRR Songs NTR,Ram Charan | MM Keeravaani | SS Rajamouli|Telugu Songs 2021

కాగా భారీ బడ్జెట్ తో డి‌వి‌వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియో లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ పాటతో అంచనాలను మరింత పెంచేశారు జక్కన్న.  ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version