Colmbatore Mappillai vs RRR: ‘నాటు నాటు’ సాంగ్ స్టెప్పులు ఆ హీరో సినిమా నుండి కాపీ కొట్టారా..? ఇన్ని రోజులు గమనించలేదుగా!

అంత ఫేమస్ అయ్యింది కాబట్టే ఈ పాటకి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. హీరోలిద్దరూ మెరుపు వేగంతో వేసిన స్టెప్పులకు ప్రపంచం మొత్తం ఊగిపోయింది.

Written By: Vicky, Updated On : June 22, 2023 5:54 pm

Colmbatore Mappillai vs RRR

Follow us on

Colmbatore Mappillai vs RRR: గత ఏడాది ఈ జనరేషన్ కి సంబంధించిన స్టార్ హీరోలైన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి రాజమౌళి లాంటి డైరెక్టర్ తో చేసిన #RRR చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా ఈ చిత్రం అన్నీ రాష్ట్రాల్లో ఇరగ కుమ్మేసింది.ఇక ఈ చిత్రం లోని ‘నాటు నాటు’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఖండాలను దాటి మరీ ఈ పాట ప్రతీ ఒక్కరి చేత స్టెప్పులు వేయించింది.

అంత ఫేమస్ అయ్యింది కాబట్టే ఈ పాటకి ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. హీరోలిద్దరూ మెరుపు వేగంతో వేసిన స్టెప్పులకు ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఇండియన్ సినిమాకి గర్వకారణం లాగ నిల్చిన ఈ పాటలోని స్టెప్పులు ఒక ప్రముఖ స్టార్ హీరో సినిమా నుండి కాపీ కొట్టింది అంటే ఎవరైనా నమ్ముతారా, కానీ నమ్మక తప్పదు, ఎందుకంటే అది నిజం కాబట్టి.

ఇక అసలు విషయంలోకి వెళ్తే 1996 వ సంవత్సరం లో తమిళ స్టార్ విజయ్ నటించిన ‘కోయింబత్తూర్ మాపిళ్ళై’ అనే చిత్రం లో ఒక పాటలో ఈ స్టెప్పులు వేస్తాడు. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఆ స్టెప్పులను మక్కికి మక్కి దింపి కంపోజ్ చేసాడని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టు చేసి #RRR మూవీ ని ట్రోల్ చేస్తున్నారు.

దానికి మన టాలీవుడ్ ఆడియన్స్ మీ హీరో కెరీర్ మొత్తం రీమేక్స్ ఉన్నాయి, పాటలను కూడా వదలకుండా రీమేక్ చేసారు, మీరు కూడా మమల్ని అనేవాళ్లేనా, ఎదో చిన్న పోలికలు ఉంటే పాట మొత్తాన్ని కాపీ కొట్టినట్టు రుద్దుతున్నారు అంటూ టాలీవుడ్ ఆడియన్స్ విజయ్ ఫ్యాన్స్ పై విరుచుకుపడుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వించేట్టు, ప్రపంచ దేశాల్లో మన తెలుగోడి సత్తా చాటి ఆస్కార్ అవార్డు ని గెలుచుకున్న పాట మీద ట్రోల్ల్స్ చేస్తే సహించబోమని తెలుగు ఆడియన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

 

https://www.youtube.com/watch?v=R2kVmvSiyUg