https://oktelugu.com/

Pushpa Movie: అదిరిపోయిన “పుష్ప” సినిమా డెలీటెడ్ సీన్… అల్లు అర్జున్ ఏం చేశాడంటే ?

Pushpa Movie: టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’. పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ల పరంగా కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. ఈ మేరకు ఇటీవల ఈ సినిమాలో ‘దాక్కో దాక్కో మేక’ అనే వీడియో సాంగ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 31, 2021 / 04:22 PM IST
    Follow us on

    Pushpa Movie: టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’. పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించింది. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ల పరంగా కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. ఈ మేరకు ఇటీవల ఈ సినిమాలో ‘దాక్కో దాక్కో మేక’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సాంగ్ యూట్యూబ్ లో తాజాగా సినిమాలోని ఓ హైలెట్ డిలేటెడ్ సీన్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ మంచి వ్యూస్ తో ఆదరణ పొందుతుంది.

    ఇక ఇప్పుడు తాజాగా సినిమాలోని ఓ డిలేటెడ్ సీన్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో ‘పుష్పరాజ్ ’కు అప్పు ఇచ్చిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి నానా గొడవా చేస్తున్నాడు. ఏమాత్రం బాధ్యత లేని యువకుడిగా కన్పించిన ‘పుష్ప’రాజ్ గేదెను అమ్మేసి ఆ అప్పు తీర్చేశాడు. అయితే అప్పు వసూలు చేయడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నానా రచ్చ చేసి ‘పుష్ప’ కుటుంబం అప్పు తీసుకున్నట్టుగా అందరికీ తెలిసేలా చేస్తాడు.

    అందుకు అప్పు తీర్చేసినట్టు అందరికీ చెప్పాలంటూ తన స్టయిల్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ సీన్ కూడా మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా… సమంత ఐటమ్ సాంగ్ తో మెప్పించింది.

    Also Read:  ‘ఆర్ఆర్ఆర్’లో హైలైట్ ఇంటర్వెల్ కాదు, ఆ సీక్వెన్సే !