RRR Movie First US Review: ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ యూఎస్ రివ్యూ

RRR Movie First US Review: తారాగణం : ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ తదితరులు. దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి, ఛాయాగ్రహణం కె.కె.సెంథిల్ కుమార్ కూర్పు : శ్రీకర్ ప్రసాద్ సంగీతం, నేపధ్య సంగీతం: ఎం. ఎం. కీరవాణి, నిర్మాత : డి.వి.వి దానయ్య. హాలీవుడ్ మేకర్స్ కూడా షాక్ అయ్యేలా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందింది ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా ఫస్ట్ […]

Written By: Shiva, Updated On : March 24, 2022 4:41 pm
Follow us on

RRR Movie First US Review: తారాగణం : ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ తదితరులు.

దర్శకత్వం: ఎస్. ఎస్. రాజమౌళి,

ఛాయాగ్రహణం కె.కె.సెంథిల్ కుమార్

కూర్పు : శ్రీకర్ ప్రసాద్

సంగీతం, నేపధ్య సంగీతం: ఎం. ఎం. కీరవాణి,

నిర్మాత : డి.వి.వి దానయ్య.

హాలీవుడ్ మేకర్స్ కూడా షాక్ అయ్యేలా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందింది ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా ఫస్ట్ యూఎస్ రివ్యూ వచ్చేసింది. ఇతర దేశాల్లో ఇప్పుడే ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు విజిల్స్ తో కేకలతో ఊగిపోతున్నారు. ప్రేక్షకుల్లో ఎక్కువమంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం.. ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచస్థాయి సినిమా, భారతీయ సినిమా స్థాయిని పెంచే సినిమా. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

RRR Movie First US Review

Also Read: RRR Movie Ticket Prices: ఆర్ఆర్ఆర్ థియేట‌ర్ల ఓన‌ర్ల‌కు షాక్‌.. ఏపీలో రంగంలోకి రెవెన్యూ అధికారులు..

‘ఆర్ఆర్ఆర్’ కథ :

నిజాం ప‌రిపాల‌న‌లో ఉన్న తెలంగాణ‌లోని ఓ గిరిజ‌న ప్రాంతంలో ఈ క‌థ మొదలైంది. నిజాంను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన ఓ బ్రిటిష్ దొర ఓ గోండు పిల్ల‌ను బలవంతంగా తీసుకువెళ్తాడు. ఆ గోండు జాతి కాప‌రి కొమురం భీంకి(ఎన్టీఆర్) ఈ విషయం తెలుస్తోంది. కొమురం భీం త‌మ‌గూడెం పిల్ల కోసం దొరల ఏలుబ‌డిలో ఉన్న ఢిల్లీలో అడుగుపెట్టి అక్కడ విద్వంసం సృష్టించి ఆ పిల్లను రక్షిస్తాడు. దాంతో కొమురం భీం (ఎన్టీఆర్)ను ఎలాగైనా ప‌ట్టుకునే బాధ్య‌తను సీతారామ‌రాజు (రామ్ చరణ్)కు అప్పగిస్తోంది బ్రిటీష్ ప్రభుత్వం. అయితే, రామ‌రాజు కొమురం భీమ్ లోని నిజాయితీ, మంచితనం న‌చ్చి అతనికి సాయం చేస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటీషు ప్ర‌భుత్వం మ‌ర‌ణ శిక్ష విధిస్తుంది.

ఈ విషయం ఏమి తెలియని భీం అనుకోకుండా సీత‌ను క‌లుసుకుంటాడు. ఆమె పెట్టిన స‌ద్ది తిని ఆక‌లి తీర్చుకున్న భీం ఆమె కష్టానికి కరిగిపోతాడు. మ‌నువాడిన వాడు ఉరికంభం ఎక్క‌బోతున్నాడ‌ని సీత క‌న్నీరు పెట్టుకుంటుంది. రామ‌రాజు గురించి భీంకు మొత్తం నిజం తెలుస్తోంది. నీ భ‌ర్త రాముడు లాంటి వాడు, రాముడికి క‌ష్టం వ‌స్తే వెళ్లాల్సింది సీత‌మ్మ కాదు. ఈ ల‌క్ష్మ‌ణుడు అంటూ కొమురం భీం మ‌ళ్లీ బ్రిటీష్ పై అటాక్ చేసి రామ‌రాజును జైలు నుంచి త‌ప్పిస్తాడు. ఇలా మొదలైన వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది ? బ్రిటిష్ ప్రభుత్వం పై భీమ్, రామరాజు కలిసి ఏ విధంగా పోరాటం చేశారు ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

నటి నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా ఎన్టీఆర్ – చరణ్ ల గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌, చరణ్‌ల నటన హృదయాలను హత్తుకుంటుంది. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి. కథను బట్టి ఇద్దరి ఐడియాలజీ వేరు అయినా.. ఉత్తర, దక్షిణ ధృవాల్లా ఇద్దరు చెరో దారిలో తమ ప్రయాణం సాగించినా.. రెండు పాత్రల మధ్య బాండింగ్ ను రాజమౌళి చాలా గొప్పగా ఎలివేట్ చేశాడు.

RRR Movie First US Review

ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు ఇద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఇద్దరూ సింహాల్లా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా.. రెండు పాత్రల మధ్య ఎమోషన్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఫైట్ సీక్వెన్స్ లో ఆడియెన్స్ కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. హీరోలిద్దరూ తమ పాత్రల కోసం పడిన కష్టం అద్భుతం. ఆ విషయంలో ఇద్దరినీ మెచ్చుకోవాలి.

అలియా భట్ కూడా సీత పాత్రలో ఒదిగిపోయింది.. ఈ సినిమాలో మిగిలిన కీలక పాత్రల్లో నటించిన ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ , శ్రీయా అలాగే మిగిలిన లార్జ్ స్టార్ కాస్ట్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గ, క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రల్లో అద్భుతంగా నటించారు. అయితే, ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ – చరణ్ ల ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి.

చరణ్ – అలియా మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఓవరాల్ గా ఇది ఒక యూనిక్ సబ్జెక్టు. అలాగే ఎమోషనల్ గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ కూడా వండర్ గా అనిపిస్తోంది. ఈ క్లైమాక్స్ ను ముందే ఏ ప్రేక్షకుడు ఊహించలేడు. అసలు ఈ ఊహించని రీతిలో క్లైమాక్స్ ను డిజైన్ చేయడం నిజంగా గొప్ప విషయమే.

తీర్పు :

మొత్తమ్మీద ఈ చిత్రం ఒక విజువల్ వండర్.. ఒక ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్. చివరగా ఒక్క మాటలో ‘ఆర్ఆర్ఆర్’ అబ్బుర పరుస్తోంది.

Also Read: Ram Charan NTR RRR Movie: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్ ఎక్కువై.. రాంచరణ్ తక్కువైనా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు

Recommended Video:

Tags