https://oktelugu.com/

RRR Movie First Day Worldwide Collection: ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

RRR Movie First Day Worldwide Collection:  ఈ రోజు కోసం ‘ఎన్టీఆర్ – చరణ్’ ఫ్యాన్స్‌ తో పాటు భారతీయ సినీ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసింది. ఒక సినిమా విడుదల తేదీ కోసం ఈ స్థాయిలో ఎదురుచూపులు.. వేడుకోలు గతంలో ఎన్నడూ లేవు. అంత ఆత్రుతతో ఆసక్తితో ఈ రోజు కోసం ప్రేక్షకులు పరితపించారు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలైంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 24, 2022 / 02:44 PM IST
    Follow us on

    RRR Movie First Day Worldwide Collection:  ఈ రోజు కోసం ‘ఎన్టీఆర్ – చరణ్’ ఫ్యాన్స్‌ తో పాటు భారతీయ సినీ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసింది. ఒక సినిమా విడుదల తేదీ కోసం ఈ స్థాయిలో ఎదురుచూపులు.. వేడుకోలు గతంలో ఎన్నడూ లేవు. అంత ఆత్రుతతో ఆసక్తితో ఈ రోజు కోసం ప్రేక్షకులు పరితపించారు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారీ పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలైంది.

    RRR Movie First Day Worldwide Collection

    మరి, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ కి సంబంధించి.. అమెరికా బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూఎస్‌లో తొలిరోజు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ 23,20,000 డాలర్ల వసూళ్లను సాధించింది. యూఎస్ కలెక్షన్స్ లో ఈ ఫిగర్ సరి కొత్త రికార్డ్. హాలీవుడ్ భారీ సినిమాలకు వచ్చిన రేంజ్ లో.. ఫస్ట్ డే ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం ఇండియన్ సినీ ఇండస్ట్రీకే గర్వకారణం.

    Also Read: RRR Movie First US Review: ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ యూఎస్ రివ్యూ

    ఎన్టీఆర్ – చరణ్.. ఈ పేర్లు వింటేనే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. అలాంటి హీరోలు ఇద్దరి కలిసి నటించిన సినిమా అంటే.. అది అమెరికా అయినా, అనకాపల్లి అయినా ఫ్యాన్స్ కు అదో పెద్ద పండుగే. ప్లేస్ ఎక్కడైనా ఆడియన్స్ ఎవరైనా థియేటర్స్ వద్ద కోలాహలం భారీ స్థాయిలో మొదలైంది. చాలా మంది ఫస్ట్ డే మూవీ చూసేందుకు ఎగబడ్డారు.

    ఈ సినిమా అద్భుత హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇక ఈ చిత్రానికి తిరుగు లేకుండా పోయింది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని తన ప్రభంజనాన్ని సగర్వంగా చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళం, కన్నడ, మ‌ల‌యాళ ఇలా చాలా భాష‌ల్లో ఏకకాలంలో విడుద‌లైన ఈ సినిమాకు ఆడియెన్స్‌ లో గొప్ప పాజిటివ్ టాక్ వచ్చింది.

    RRR Movie First Day Worldwide Collection

    అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ట్రేడ్ వ‌ర్గాలు వెల్లడించిన స‌మాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు తొలిరోజు రూ.194.8 కోట్లు గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయని తెలుస్తోంది. తెలంగాణ‌లో రూ.31.1కోట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.51.2 కోట్లు, క‌ర్ణాట‌క‌లో రూ.11.9 కోట్లు, త‌మిళ‌నాడు రూ.13.8 కోట్లు, కేర‌ళ రూ.4.2కోట్లు రాగా హిందీ వెర్షన్‌ లో ‘ఆర్ఆర్ఆర్’. 59.6కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ు రాబట్టిందని తెలుస్తోంది.

    ఇక షేర్ కలెక్షన్స్ పరంగా చూస్తే.. ‘రాధేశ్యామ్’ రూ.118.1కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    గమనిక : అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ట్రేడ్ వ‌ర్గాలు వెల్లడించిన అఫీషియల్ స‌మాచారం ఇది.

    Also Read: RRR Movie Ticket Prices: ఆర్ఆర్ఆర్ థియేట‌ర్ల ఓన‌ర్ల‌కు షాక్‌.. ఏపీలో రంగంలోకి రెవెన్యూ అధికారులు..

    Recommended Video:

    Tags