Radhe Shyam Movie Box Office Collection: ప్రభాస్‌కు బాహుబలితో దేశ వ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. ఐదు భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్‌తోనే ఆయన ఏ మూవీ చేసినా పాన్ ఇండియా లెవల్లోనే చేస్తున్నారు. అయితే బాహుబలి మాత్రమే ఆయన ఇమేజ్‌ను పెంచింది. ఆ తర్వాత చేసిన పాన్ ఇండియా సినిమాలు రెండూ డిజాస్టర్‌గా మిగిలాయి.
ఎన్నో అంచనాల నడుమ వచ్చిన రాధేశ్యామ్ అట్టర్ ప్లాప్ టాక్‌తో అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది. పుష్పలాగా రెండు మూడు రోజుల తర్వాత హిట్ టాక్ వస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. ఇప్పుడు సినీ అభిమానులు దాదాపుగా రాధేశ్యామ్‌ను మర్చిపోయారు. అందరూ త్రిపుల్ ఆర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో రాధేశ్యామ్ భారీ నష్టాలతో రన్ టైమ్‌ను ముగించుకుంది.
13 రోజులుగా థియేటర్లలో ఆడుతున్న ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే.. మరో వారం పాటు థియేటర్లలో కలెక్షన్లు రాబట్టేది. కానీ ప్లాప్ టాక్ రావడంతో.. రన్ టైమ్ త్వరగానే ముగిసిపోయింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాతో కలిపి రూ. 202.80 కోట్లు చేసింది. దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా రూ.204గా నమోదైంది.
అయితే ఈ 13 రోజుల్లో ఈ మూవీ దారుణమైన కలెక్షన్లను వసూలు చేసింది. రెండు రాష్ట్రాల్లో కలిపి 13 రోజుల్లో రూ.54.09 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.00 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది. మొత్తంగా రూ.151 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఇంకో రూ.121 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకునేది. కానీ ఇలా దారుణమైన నష్టాలతో ఈ మూవీ ప్రభాస్ కెరీర్‌లో మిగిలిపోయింది.
వరుసగా సాహో, రాధేశ్యామ్ మూవీలు డిజాస్టర్ కావడంతో.. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ మీద దెబ్బ పడే అవకాశం ఉంది. సాహో మూవీ ప్లాప్ అయినా బాగానే కలెక్ట్ చేసింది. కానీ రాధేశ్యామ్ మాత్రం దారుణమైన దెబ్బ కొట్టింది. ఇక రాబోయే సలార్ మూవీ మీదే ప్రభాస్ ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఆ మూవీ హిట్ అయితేనే మళ్లీ పాన్ ఇండియా మార్కెట్ నిలబడుతుంది. లేదంటే అంతే సంగతి.
Also Read: RRR Movie First US Review: ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ యూఎస్ రివ్యూ
Recommended Video: