RRR AP & Telangana First Day Collections: విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో ఫస్ట్ డే కలెక్షన్స్ లో అదరగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 9000 స్క్రీన్ లలో విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డులను బద్దలు కొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మొదటి రోజు రూ.73 కోట్లకు పైగానే షేర్ ని రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.
RRR AP & Telangana First Day Collections
Also Read: RRR Movie First Day Worldwide Collection: ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఏపీ & తెలంగాణలో ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ :
నైజాం – 21.40 కోట్లు
సీడెడ్ – 12.46 కోట్లు
ఉత్తరాంధ్ర – 6.35 కోట్లు
గుంటూరు – 6.70 కోట్లు
ఈస్ట్ గోదావరి – 7.43 కోట్లు
వెస్ట్ గోదావరి – 5.60 కోట్లు
కృష్ణ – 5.51 కోట్లు
నెల్లూరు – 6.56 కోట్లు
తొలిరోజే ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం నిజంగా విశేషమే. బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ సినిమా కంటే కూడా ఈ చిత్రానికే రెట్టింపు కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సిమిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలవడం విశేషం. ప్రస్తుతం మరో రెండు వారాలు వరకూ ఏ భారీ సినిమా రిలీజ్ కి లేకపోవడం ఈ సినిమాకు ఇంకా బాగా కలిసి రానుంది.
RRR AP & Telangana First Day Collections
ఏది ఏమైనా ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి… ఆ అంచనాలను చాలా తేలికగా అందుకుంది. సినిమాపై ఉన్న హైప్ ను చాలా ఈజీగా అందుకుంది. పైగా భారీ హైప్, సోలో రిలీజ్, విపరీతంగా చేసిన ప్రమోషన్లు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి.
గమనిక : అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ఇది.
Recommended Video: