Homeఎంటర్టైన్మెంట్RRR Movie: ఆర్ఆర్ఆర్ లో ఊహకు అందని సర్ ప్రైస్ పెట్టిన జక్కన్న.. మరో లెవల్...

RRR Movie: ఆర్ఆర్ఆర్ లో ఊహకు అందని సర్ ప్రైస్ పెట్టిన జక్కన్న.. మరో లెవల్ లో ఉంటుందట

RRR Movie: సినీ ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అద్భుతమైన సమయం మార్చి 25న వస్తుంది. జక్కన్న చూపించబోయే మాయాజాలం ఎంత వండర్ఫుల్ గా ఉంటుందో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. ఒక హీరో ఉంటేనే అన్ని ఎలిమెంట్స్ ఉంటే.. ఆర్ ఆర్ ఆర్ లో చరణ్, తారక్ లాంటి స్టార్ లు ఉన్నప్పుడు.. ఇంకెన్ని సర్ప్రైస్ ఎలిమెంట్స్ ఉంటాయో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

RRR Movie
RRR Movie

రెండో విడత ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీం.. ఇంటర్వ్యూలు, పాటలతో ప్రమోషన్స్ తో హైప్ పెంచేస్తోంది. ఇంటర్వ్యూ లో భాగంగా రాజమౌళి, చరణ్, తారక్ లు చెబుతున్న మాటలు సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. సినిమాలో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయని, సినిమా చూస్తున్నంత సేపు హీరోలను మర్చిపోయి కేవలం భీమ్, రామరాజు పాత్రలు మాత్రమే చూస్తారు అంటూ ఇప్పటికే జక్కన్న చాలా సార్లు చెప్పాడు.

Also Read:  ప్చ్.. పవన్ ‘భగత్ సింగ్’లో బూతు సిరీస్ నటుడు

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా ప్లాన్ చేసింది జక్కన్న టీం. ఇండియా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈవెంట్ కు రప్పిస్తున్నారు. కర్ణాటకలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి మరో సర్ప్రైజ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

ఈ సినిమాలో చరణ్, ఆలియా భట్ మధ్య వచ్చే ఒక లవ్ సాంగ్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని చెబుతున్నారు. ఆ ఒక్క పాటలోనే ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ పాట అటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

RRR Movie
RRR

సినిమాలో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఒకసారి సర్ ప్రైస్ ఎలిమెంట్స్ ఉంటాయని ఇప్పటికే జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. దాంతోపాటు చరణ్, తారక్ ల మధ్య వచ్చే ఫైట్ సీన్లు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తాయని రైటర్ విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చాడు. మరి ఇన్ని సర్ ప్రైజ్ ల తో వస్తున్న ఈ మూవీ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Sarkaru Vaari Paata Movie: ఈ సారి చాలా జాగ్రత్త పడుతున్న ‘మహేష్’ టీమ్

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version