RRR Movie: జక్కన్న చెక్కిన ఆర్ ఆర్ ఆర్ మాయాజాలం కోసం ప్రపంచ సినీజనాలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మామూలుగానే జక్కన్న సినిమాలు అంటే ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. ఇక కలెక్షన్ల పరంగా ఎంత చెప్పినా తక్కువే. సరికొత్త రికార్డులు నమోదు కావాల్సిందే. అయితే ఇప్పుడు ఏపీలో కూడా ఆర్ ఆర్ఆర్‌కు టికెట్ల రేట్లు కన్ఫర్మ్ అయిపోయాయి.

సి సెంటర్ లో బాల్కనీ కోసం రూ.170, గరిష్టంగా రూ.206 వరకు అమ్ముకోవచ్చు. ఇక బి సెంటర్ లో అయితే బాల్కనీ ధర రూ.183, గరిష్టగా రూ.236 గా నిర్ణయించారు. ఈ రేట్లు కొనసాగితే గనక మొదటి రోజు ఏపీ, తెలంగాణలో కలిపి రూ.50 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేస్తే మాత్రం.. ఈ షేర్ మరింత పెరగొచ్చు. ఇందులో ఏపీ నుంచే రూ.30 నుంచి రూ.35కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది.
Also Read: Janasena-BJP: పవన్ ఆ స్టాండ్ తీసుకుంటే బీజేపీ పరిస్థితి ఏంటి?
ఇందులో నైజాం నుంచి మొదటి రోజు రూ.15 నుంచి రూ.19 కోట్ల దాకా షేర్ సాధించే అవకాశం ఉంది. పైగా ఏపీలో 5 షోలకు కూడా పర్మిషన్ ఇచ్చేశారు. తెలంగాణలో కూడా ఎలాగూ 5 రోజులకు పర్మిషన్ ఉంది. కాబట్టి ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కలిపి భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఇక ఐదు భాషల్లో రిలీజ్ అవుతుండటగంతో అక్కడ కూడా భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈజీగానే కలెక్షన్ల వరద ఖాయం.

అటు ఓవర్సీస్ లో కూడా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది ఈ మూవీ. ఇలా మొత్తం చూసుకుంటే రూ.200 కోట్ల దాకా గ్రాస్ అందుకోనుంది ఆర్ఆర్ఆర్. ఎలాగూ అన్ని అడ్డంకులు తొలగిపోయాయి కాబట్టి కాబట్టి జక్కన్న టార్గెట్ గా పెట్టుకున్న రూ.200 కోట్ల గ్రాస్‌పెద్దగా కష్టం కాదు. ఇక రేపటి నుంచే ఓపెనింగ్స్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. మరి జక్కన్న ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతాడో వేచి చూడాలి.
Also Read: భీమ్లానాయక్ ఓటీటీలో వచ్చే డేట్ ఇదే.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్..