CM KCR- JOB Notification: రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ రావడం లేదు. కానీ ఇటీవలే సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇది ముందుస్తు ఎన్నికల వ్యూహమనే చాలా మంది అనుమాన పడుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌పై నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. వారు నోరు విప్పితే ఆ వ్యతిరేకత ఇంకా పెరిగే చాన్స్ ఉంది. దీంతోనే నోటిఫికేషన్ల అంశాన్ని ఎప్పటికప్పుడు నొక్కి చెబుతున్నారు టీఆర్ఎస్ లీడర్లు..
వాస్తవానికి సీఎం ప్రకటన అనంతరం యువత పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్లకు పరుగులు పెడుతోంది. సీఎం ఉద్యోగాల ప్రకటనను సైతం టీఆర్ఎస్ లీడర్లు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పెద్ద ఎత్తున్న నోటిఫికేషన్స్ వస్తున్నాయని, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని టైం వేస్ట్ చేసుకోవద్దంటూ సూచిస్తున్నారు. సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉండి పుస్తకాలతో యుద్ధం చేయాలని సలహా ఇస్తున్నారు.

నోటిఫికేషన్ల విషయంలో కొందరి నమ్మకం కుదరడం లేదు. ఇప్పటికే ఇలా పలుమార్లు ఊరించి ఉసూరనిపించారు. ఇప్పుడు కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న గ్యారంటీ లేదని కొందరు చెబుతున్నారు. ఒక వేళ నోటిఫికేషన్స్ వేసినా ఎదో ఒక సాకుతో దాన్ని కోర్టులో నిలిచిపోయేలా చేస్తారని చెప్పుకొస్తున్నారు. మరి కొందరు మాత్రం చాన్స్ తీసుకోవడం ఎందుకు ముందస్తుగానే ప్రిపేర్ అయితే మంచిదే అన్న తీరుగా పుస్తకాలను బయటకు తీస్తున్నారు.
Also Read: AP Three Capitals Bill: మళ్లీ సభ ముందుకు మూడు రాజధానుల బిల్లు? ఈసారి ఆమోదం పక్కా?

యూత్‌ను రాజకీయ అంశాల నుంచి దూరం చేసేందుకే టీఆర్ఎస్ ఈ ప్లాన్ వేసి సక్సెస్ అయిందనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే వయో పరిమితిని సైతం 44 ఏళ్లకు పెంచిందనే ఆరోపణలున్నాయి. మరి ఈ ప్లాన్ చివరి వరకు సక్సెస్ అవుతుందా? చూడాలి మరి. ఒక వేళ నోటిఫికేషన్స్ రాకుంటే టీఆర్ఎస్ ప్లాన్ బెడిసి కొట్టే చాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: AP Cabinet Expansion: వైసీపీలో సగం మంది ఎమ్మెల్యేలకు నో టికెట్.. జగన్ ఏమన్నారంటే..?