RRR Movie: పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ను అద్భుతంగా ప్రమోట్ చేశారు. కానీ కరోనా మూడో వేవ్ కారణంగా సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది. మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. దేశంలో ఒమిక్రాన్ చూపించే ప్రభావాన్ని బట్టి కొత్త రిలీజ్ డేట్ వస్తోంది. అది నాలుగు నెలలు పట్టొచ్చు, టైం బాగా లేకపోతే ఏడాది కూడా పట్టొచ్చు. కాబట్టి.. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం పెట్టిన ఖర్చు అంతా వృధానే.

అయితే, “ఆర్ఆర్ఆర్” టీమ్ తో పాటు అభిమానులు కూడా భారీగా ఖర్చు పెట్టారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ థియేటర్ల వద్ద భారీ బ్యానర్లను, పెద్ద పెద్ద కటౌట్లు ప్లాన్ చేశారు. ఇప్పటికే కొన్ని థియేటర్స్ వద్ద అవి ఏర్పాటు కూడా చేశారు. ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఈ విషయంలో పోటీ పడ్డారు. దాంతో ఏ సినిమాకి లేనంతగా ఈ సినిమా కటౌట్లు ఖర్చు, బ్యానర్ల ఖర్చు రెట్టింపు అయింది.
మరోపక్క ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా గట్టిగా ప్రమోషన్స్ చేసింది. ఎన్టీఆర్, చరణ్ లతో పాటు అలియా భట్ కూడా ప్రమోషన్స్ కోసం డేట్లు ఇచ్చింది. అలియా ప్రమోషన్స్ కి ఇచ్చిన డేట్లుకు కూడా రెమ్యునరేషన్ తీసుకుంది. ఆమెకు రోజుకు 20 లక్షలు అని టాక్. అలాగే అజయ్ దేవగన్ కి కూడా ప్రమోషన్స్ కోసం వేరే రెమ్యునరేషన్ ఇచ్చారు. 40 లక్షల వరకు ఇచ్చారట.
Also Read: ఆర్ఆర్ఆర్ వాయిదా: తెగ వైరల్ అవుతున్న మీమ్స్
దీనికితోడు రోజుకొక నగరం చొప్పున చాలా నగరాలు తిరగడానికి ఫ్లైట్ ఖర్చులు అదనం. పైగా ఒకటి రెండు రోజులు కాదు, ఏకంగా నెల రోజులుగా ఈ భారీ ప్రమోషన్స్ జరిగాయి. ముంబై, చెన్నై, బెంగుళూరు, తిరువనంతపురం లాంటి మహా నగరాల్లో భారీ భారీ ఈవెంట్స్ ఘనంగా చేశారు. అదేవిధంగా ముంబైలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను కూడా ఘనంగా చేశారు.
పైగా ముంబై ఈవెంట్ కి హైదరాబాద్ నుంచే చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్లారని టాక్ ఉంది. మొత్తమ్మీద పబ్లిసిటీ కోసం ఆర్ఆర్ఆర్ టీం భారీగా ఖర్చు పెట్టింది. ఇక హీరోలు, దర్శకుడు, అలాగే నిర్మాత కూడా చాలా కష్టపడ్డారు. కానీ చివరకు సినిమా పోస్ట్ ఫోన్ అయింది. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం పెట్టిన డబ్బులన్నీ వృధా అయ్యాయి. అలాగే టైమ్ కూడా వేస్ట్ అయింది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’.. భీమ్లా నాయక్ తోపాటు టాలీవుడ్, బాలీవుడ్ ను ముంచేసిందా?