https://oktelugu.com/

కీరవాణి నుండి ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  కలయికలో గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చిత్రబృందం సినిమా షూటింగ్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్  కీరవాణి ఈ సినిమా అప్ డేట్ ను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 21, 2020 / 05:03 PM IST
    Follow us on

     
    యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  కలయికలో గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చిత్రబృందం సినిమా షూటింగ్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్  కీరవాణి ఈ సినిమా అప్ డేట్ ను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
     
    ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులుగా  కీరవాణి సమాధానం ఇస్తూ.. ‘ఇది నాన్ కోవిడ్ నోట్..  ప్రస్తుతం నేను రెండు సినిమాల కోసం పని చేస్తున్నాను, వాటిలో ఒకటి క్రిష్ యొక్క సొంత సినిమా అయితే, మరొకటి కె. రాఘవేంద్రరావు నిర్మాణంలో వస్తోన్న సినిమా ఒకటి. ఇక మనమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఆర్‌ఆర్‌ఆర్’ పనులు కూడా త్వరలో తిరిగి ప్రారంభమవ్వనున్నాయి” అని కీరవాణి ట్వీట్ చేయడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ తో హడావుడి మొదలెట్టారు.
    Also Read : ప్రభాస్ ఎపిక్ కోసం గొప్ప లెజెండరీ డైరెక్టర్!
    మొదటి నుండి  ఈ సినిమా గురించి ఎలాంటి విషయాలు బయట పడకుండా రాజమౌళి అన్నిరకాల  జాగ్రత్తలు తీసుకుంటునప్పటికీ..  ఈ చిత్రానికి పని చేస్తోన్న సాంకేతిక బృందంలో ఎవరోఒకరు ఫ్యాన్స్  బాధ చూడలేక  ఎదో రకంగా సినిమాకి సంబధించిన కీలకాంశాలను ఇలా ఏదొక సందర్భంలో బయట పెడుతున్నారు.  ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న  అజయ్ దేవగణ్  కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ గా కనిపించబోతున్నాడు. అజయ్ సరసన  శ్రియా సరన్ నటిస్తోంది. ఇటివలే ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పేసి రాజమౌళి నుండి వార్నింగ్ కూడా తీసుకుంది  శ్రియా.
    ఇక రాజమౌళి ముందుగానే  ప్రకటించినట్లుగా ‘ఆర్ఆర్ఆర్’  క్వాలిటీ విషయంలో  ఎక్కడా  రాజీపడకుండా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం,  చరణ్ అల్లూరి పాత్రల్లో  కనిపించబోతున్నారు.  ముఖ్యంగా ధృడంగా ఉండే  కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్  లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు చేసి.. ఈ సినిమాలో నటిస్తున్నాడు. పైగా తారక్ చేస్తోన్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ. అందుకే ఈ మూవీలో తన పూర్తి నటనా సామర్ధ్యాన్ని చూపించడానికి రెడీ అయ్యాడు తారక్. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.
    Also Read : ‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల