RRR Fans: తరలిపోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ కారణమెంటీ?

RRR Fans: దర్శకధీరుడు రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీని జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈనేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ ను చిత్రయూనిట్ ఓ రేంజులో నిర్వహిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అనే తేడాలేకుండా అన్ని ఏరియాల్లోనూ ప్రమోషన్స్ కుమ్మిపారేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై హైప్ ను క్రియేట్ చేస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం నందమూరి, మెగా ఫ్యాన్స్ తోపాటు యావత్ సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి […]

Written By: NARESH, Updated On : December 14, 2021 10:18 am
Follow us on

RRR Fans: దర్శకధీరుడు రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీని జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈనేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ ను చిత్రయూనిట్ ఓ రేంజులో నిర్వహిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అనే తేడాలేకుండా అన్ని ఏరియాల్లోనూ ప్రమోషన్స్ కుమ్మిపారేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై హైప్ ను క్రియేట్ చేస్తోంది.

RRR Movie

‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం నందమూరి, మెగా ఫ్యాన్స్ తోపాటు యావత్ సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కావడంతో ఈమూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొమురంభీం, అల్లూరి సీతరామరాజు పాత్రల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈమూవీలో రాంచరణ్ కు జోడీగా అలియాభట్, ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, హీరోయిన్ శ్రియాశరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్, పోస్టర్స్ అన్ని కూడా అభిమానుల అంచనాలను రెట్టింపు చేశాయి. ఈక్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అందరి దృష్టి నెలకొంది.

‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పలు భాషల్లో గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా తొలుత హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు. మంబై ఫిల్మ్ సిటీలో జరుగనున్న ఈ వేడుకలకు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సమాచారం.

Also Read: Pushpa Movie: “పుష్ప” సినిమా నాలుగు సినిమాల కష్టం అంటున్న: అల్లు అర్జున్

ఇక ఈ వేడుక కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన నందమూరి, మెగా అభిమానులు సుమారు మూడు వేల మంది ముంబైకు తరలి వెళ్లేందుకు రెడీ ఉన్నారని సమాచారం. రెండు ప్రత్యేక రైళ్లలో వీరంతా ముంబైకి వెళుతుండటం సంచలనంగా మారుతోంది.

హిందీలోనే ఇలాంటి ఏర్పాట్లను చేస్తుంటే టాలీవుడ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత భారీగా చేస్తారోననే ఆసక్తి నెలకొంది. ‘ఆర్ఆర్ఆర్’కు వస్తున్న హైప్ చూస్తున్న త్వరలోనే ‘బాహుబలి’ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Rajinikanth: ర‌జినీకాంత్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?