https://oktelugu.com/

RRR Fans Dies In Accident: ముగ్గురి ప్రాణం తీసిన త్రిపుల్ ఆర్ బెన్ ఫిట్ షో.. రోడ్డు ప్ర‌మాదంలో దారుణం

RRR Fans Dies In Accident: మామూలు సినిమాల‌కే అభిమానులు ఎగ‌బ‌డి చూస్తారు. అలాంటిది ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న రాజ‌మౌళి సినిమా, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న త్రిపుల్ ఆర్‌ను చూసేందుకు ఇంకెంత ఆస‌క్తి చూపిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌లు ద‌ఫాలుగా వాయిదా ప‌డ‌టంతో.. చాలా మంది ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తిగా ఎద‌రు చూస్తున్నారు. ఈ మూవీకి దేశ వ్యాప్తంగా ఎక్క‌డ లేని క్రేజ్ ఏర్ప‌డింది. సామాన్య సినీ అభిమానుల ద‌గ్గ‌రి […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 25, 2022 / 04:04 PM IST
    Follow us on

    RRR Fans Dies In Accident: మామూలు సినిమాల‌కే అభిమానులు ఎగ‌బ‌డి చూస్తారు. అలాంటిది ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న రాజ‌మౌళి సినిమా, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి న‌టిస్తున్న త్రిపుల్ ఆర్‌ను చూసేందుకు ఇంకెంత ఆస‌క్తి చూపిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌లు ద‌ఫాలుగా వాయిదా ప‌డ‌టంతో.. చాలా మంది ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తిగా ఎద‌రు చూస్తున్నారు.

    RRR Fans Dies In Accident

    ఈ మూవీకి దేశ వ్యాప్తంగా ఎక్క‌డ లేని క్రేజ్ ఏర్ప‌డింది. సామాన్య సినీ అభిమానుల ద‌గ్గ‌రి నుంచి.. సినీ సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. ఒక్క హీరో ఉంటేనే ఆ ఆనందం వేరు. అలాంటిది ఎన్నో ఏండ్ల త‌ర్వాత ఇద్ద‌రు స్టార్ హీరోలు క‌లిసి న‌టిస్తున్న మ‌ల్టీ స్టార‌ర్ మూవీ కావ‌డంతో.. వారి అభిమానులు ఎన్నో రోజులుగా సంద‌డి మొద‌లెట్టారు.

    Also Read: RRR Movie Box Office Collection Worldwide: అఫీషియల్ : ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే

    అయితే ఈ ఆతృత కొన్ని చోట్ల ప్ర‌మాదాల‌కు కూడా దారి తీస్తోంది. త‌మ అభిమాన హీరోల సినిమాను ఫ‌స్ట్ డే చూడాల‌నే వారి కోరిక‌.. చివ‌ర‌కు వారి ప్రాణాల మీద‌కు తీసుకు వ‌చ్చింది. మూవీ పాజిటివ్ టాక్ వ‌చ్చిన ఆనందంలో.. ఇదో విషాదంగా మిగిలింది. చిత్తూరు జిల్లా వి.కోట వ‌ద్ద కొంద‌రు అభిమానులు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర బ్యాన‌ర్ క‌ట్టారు.

    Jr NTR

    ఆ త‌ర్వాత ముగ్గురు క‌లిసి ఒకే బైక్ మీద బెన్ ఫిట్ షో చూసేందుకు వెళ్తుండ‌గా.. మార్గ మధ్యలో రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. అర్థ‌రాత్రి ఈ బెనిఫిట్‌ షో టికెట్ల కోసం వి.కోటకు వారు బ‌య‌లు దేరి వెళ్లారు. వీరు ముగ్గురూ తమిళనాడు బోర్డర్‌లోని ఓ మారుమూల ప‌ల్లెటూరు నుంచి వ‌చ్చార‌ని తెలుస్తోంది. వీరు థియేట‌ర్‌కు వెళ్తున్న క్ర‌మంలో.. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీ కొట్ట‌డంతో.. అక్క‌డిక‌క్క‌డే వీరు ప్రాణాలు కోల్పోయారు. రామకుప్పం, వీ. కోటకు చెందిన యువకులుగా వారిని గుర్తించారు. ఈ వార్త తెలిసి కుటుంబ స‌భ్యులు గుండెల‌విసేలా ఏడుస్తున్నారు.

    Also Read: ఎయిర్ ట్యాక్సీలో కిలోమీట‌ర్‌కు రూ.12.. హాయిగా గాల్లో వెళ్లొచ్చు…

    Tags