https://oktelugu.com/

Celebrities Heap Praise On RRR: ఆర్ఆర్ఆర్‌పై సినీ హీరోల ప్ర‌శంస‌లు.. ఎవ‌రెవ‌రు ఏం చెప్పారంటే..

Celebrities Heap Praise On RRR: సినీ జ‌నాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన త‌రుణం రానే వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో ఆర్ ఆర్ ఆర్ జాత‌ర షురూ అయిపోయింది. ఎక్క‌డ చూసినా.. ఎవ‌రిని క‌దిలించినా త్రిపుల్ ఆర్ మేనియానే క‌నిపిస్తోంది. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ కోసం సామాన్య జ‌న‌మే కాకుండా.. సినీ జ‌నాలు కూడా థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. సినిమా చూసిన చాలామంది హీరోలు, ద‌ర్శ‌కులు […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 25, 2022 / 03:51 PM IST
    Follow us on

    Celebrities Heap Praise On RRR: సినీ జ‌నాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన త‌రుణం రానే వ‌చ్చేసింది. థియేట‌ర్ల‌లో ఆర్ ఆర్ ఆర్ జాత‌ర షురూ అయిపోయింది. ఎక్క‌డ చూసినా.. ఎవ‌రిని క‌దిలించినా త్రిపుల్ ఆర్ మేనియానే క‌నిపిస్తోంది. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ కోసం సామాన్య జ‌న‌మే కాకుండా.. సినీ జ‌నాలు కూడా థియేట‌ర్ల‌కు క్యూ క‌డుతున్నారు. సినిమా చూసిన చాలామంది హీరోలు, ద‌ర్శ‌కులు ఈ మూవీపై స్పందించారు.

    విలక్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ స్పందిస్తూ.. ఈ మూవీ కొత్త రికార్డుల‌ను కొల్ల‌గొట్టేందుకు రెడీగా ఉంది. రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌ను చూస్తుంటే గ‌ర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మూవీని చూసి స్పందించారు. రాజ‌మౌళి త‌న రెండు తుపాకులు అయిన ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌తో బాక్సాఫీస్‌ను గురి పెట్టార‌ని, రికార్డులు బ‌ద్ద‌ల‌య్యేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైందంటూ రాసుకొచ్చారు.

    Prakash Raj

    విల‌క్ష‌ణ న‌టుడు అడ‌వి శేష్ మూవీని చూశారు. ఆయ‌న ట్వీట్ చేస్తూ.. త్రిపుల‌ర్ ఆర్ ఓ అగ్నిప‌ర్వ‌తం అంటూ త‌న ఒపీనియ‌న్ చెప్పాడు. హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ స్పందిస్తూ.. ఆర్ ఆర్ ఆర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అని త‌న రివ్యూ ఇచ్చారు. అలాగే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కూడా పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. త్రిపుల్ ఆర్ ఒ మాస్ట‌ర్ పీస్ అని చెప్పుకొచ్చారు.

    Also Read:   అఫీషియల్ : ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలివే

     

    Adivi Sesh

    యంగ్ హీరో కార్తికేయ ట్వీట్ చేస్తూ.. ఈ మూవీ త‌న‌కు కొత్త అనుభూతిని ఇచ్చింద‌ని, అంద‌రూ త‌ప్పుకుండా చూడాలంటూ చెప్పుకొచ్చారు. ఇక డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ.. మూవీ మైండ్ బ్లోయింగ్ లా ఉందంటూ కామెంట్ చేశారు. దేశం మొత్తం గ‌ర్వించ‌ద‌గ్గ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి అని వివ‌రించారు.

    Karthikeya

    టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స్పందిస్తూ.. మూవీకి పాజిటివ్ రాక్ రావ‌డం సంతోషంగా ఉందని.. కుటుంబంతో క‌లిసి త్వ‌ర‌లోనే సినిమా చూస్తానంటూ చెప్పుకొచ్చారు. సాంకేతిక బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌మిళ హీరో శివ‌కార్తికేయ‌న్ స్పందిస్తూ.. మూవీ విడుద‌ల సంద‌ర్భంగా టీమ్‌కు త‌న విషెస్ తెలిపారు. న‌టుడు శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. నిప్పు, నీరు క‌లిస్తే మామూలుగా ఉండ‌ద‌ని, మూవీ ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉందంటూ తెలిపారు.

    Also Read  ‘కశ్మీర్ పండింట్లను వాడుకొని దర్శకుడు కోట్లు సంపాదించాడు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

     

    Recommended Video:

    Tags