AP Cabinet Reshuffle 2022: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సీఎం జగన్ ఆదివారం సహచర మంత్రులకు విందు ఇవ్వనున్నారు. శుక్రవారంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం నాటి విందు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎప్పుడూ లేనట్టుగా సీఎం విందు సమావేశం ఏర్పాటు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో విస్తరణ అంశాన్ని ప్రస్తావించిన సీఎం చేర్పులు మార్పులకు సిద్ధంగా ఉండాలని సహచరులకు సూచించారు. రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రారంభంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మంత్రివర్గం నుంచి తొలగిస్తున్న వారికి అంతే ప్రాధాన్యత కలిగిన పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో కొందరు మంత్రులు పదవులను వదులుకునేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో సీఎం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుండడం ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా సైతం సిద్ధమైందని చెబుతున్నారు.
అయితే అధినేత తీసుకున్న నిర్ణయం కొందరు మంత్రులకు మింగుడు పడడం లేదు. 2019 మేలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2020 మార్చి నుంచి కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. దాదాపు రెండేళ్ల పాటు తీవ్ర ప్రభావం చూపింది. దీంతో చేతిలో శాఖ ఉన్నా పనితీరు చూపలేకపోయామన్న నిరాశ మంత్రుల్లో ఉంది. మంత్రుల్లో చాలామంది సచివాలయంలో కనిపించలేదన్న వాదనా ఉంది. కొందరు మంత్రుల పనితీరు కొలమానంగా చూసి కొనసాగిస్తామన్న సీఎం ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొవిడ్ తో శాఖపరంగా పనితీరు చూపే అవకాశమే లేనప్పడు కొలమానం ఎలా చూస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయంగా జిల్లాలపై పట్టు ఉన్న మంత్రులను సీనియార్టీ చూపి కొనసాగిస్తారని..మిగతా వారిని పొమ్మన లేక పనితీరు బాగాలేదని చూపి బయటకు పంపిస్తారన్న ప్రచారం అధికార పార్టీలో జోరుగా సాగుతోంది.
Also Read: Celebrities Heap Praise On RRR: ఆర్ఆర్ఆర్‌పై సినీ హీరోల ప్రశంసలు.. ఎవరెవరు ఏం చెప్పారంటే..
పేరుకే మంత్రులు కానీ చేతిలో పవర్ అంటూ ఏదీ లేదు. శాఖపరంగా ప్రభావం చూపలేని పరిస్థితి. అంతా నవరత్నాల మయం. అటు అమాత్యులన్న మాటే తప్పించి ఎటువంటి నిధులు, విధులు లేవు. ఈ మూడేళ్లలో చాలా మంది మంత్రులు మొక్కుబడి తంతుగా ముందుకు సాగారు. ఒక విధంగా చెప్పాలంటే చేతిలో అధికారమే తప్ప.. ఉపయోగించలేని దుస్థితి వారిది. ఈ పరిస్థితుల్లో మంత్రులుగా కొనసాగడం కంటే ఎమ్మెల్యేగా ఉండిపోవడమే మంచిదన్న భావన వారిలో ఉంది. కనీసం ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గం ప్రజలతో గడపవచ్చని భావిస్తున్నారు. ఎన్నికలకు పట్టుమని రెండేళ్లయినా లేదు. మంత్రి కోసం పాకులాడే కంటే ఉన్న ఎమ్మెల్యే పదవితో సరిపెట్టుకుంటే ఎంతో మంచిదని అధికార పార్టీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.
Also Read: ‘కశ్మీర్ పండింట్లను వాడుకొని దర్శకుడు కోట్లు సంపాదించాడు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు