https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ ఎఫెక్ట్: కేజీఎఫ్2, పుష్ప పోస్ట్ పోన్

రాజమౌళి చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మేనియా మొదలైంది. నిన్న విడుదల చేసిన మేకింగ్ వీడియో వైరల్ కావడం.. భారీగా పాజిటివ్ స్పందన రావడంతో మిగతా సినిమాలు ఇప్పుడు విడుదల తేదీలను ‘ఆర్ఆర్ఆర్’ కోసం వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ సినిమా నిజానికి దసరాకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ కు కరోనా సోకడంతో ఈ సినిమా ఆలస్యమైంది. దసరాకు ప్లాన్ చేసినా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ దసరాకే […]

Written By:
  • NARESH
  • , Updated On : July 16, 2021 / 04:27 PM IST
    Follow us on

    రాజమౌళి చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మేనియా మొదలైంది. నిన్న విడుదల చేసిన మేకింగ్ వీడియో వైరల్ కావడం.. భారీగా పాజిటివ్ స్పందన రావడంతో మిగతా సినిమాలు ఇప్పుడు విడుదల తేదీలను ‘ఆర్ఆర్ఆర్’ కోసం వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

    అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ సినిమా నిజానికి దసరాకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్ కు కరోనా సోకడంతో ఈ సినిమా ఆలస్యమైంది. దసరాకు ప్లాన్ చేసినా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ దసరాకే రాబోతుండడంతో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

    కేజీఎఫ్2 దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం ఇప్పుడు ఇదే మార్గంలో ఆలోచిస్తున్నాడట. ఈ సంవత్సరం చివరి నాటికి సీక్వెల్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 2021 నాటికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి మొత్తం తగ్గిన తర్వాత ‘కేజీఎఫ్2’ను విడుదల చేయడానికి చూస్తున్నారు.

    నిన్న విడుదల చేసిన ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోకు భారీ స్పందన వచ్చింది. ఎన్టీఆర్, రాంచరణ్, ఆలియా భట్, అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కరోనా థర్డ్ వేవ్ కనుక రాకుంటే ఆరోజు సాధ్యమేనని తెలుస్తోంది. రాజమౌళి సినిమా విడుదలయ్యాకే కేజీఎఫ్ తోపాటు పుష్ప కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.