దేశంలోనే తొలి రేషన్ ఏటీఎంను గురుగ్రామ్ లోని ఫరూక్ నగర్ లో ఏర్పాటు చేసింది హరియానా ప్రభుత్వం. ఈ ఏటీఎం నుంచి 5-7 నిమిషాల్లో 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదలవుతాయి. ఇందులో బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుంది. టచ్ స్ర్కీన్ ద్వారా లబ్ధిదారుడు ఆధార్ లేదా రేషన్ ఖాతా నెంబర్ పొందుపరచాలి. బయోమెట్రిక్ ధ్రువీకరణ జరగగానే, వారికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమేటిక్ గా సంచుల్లో నింపేస్తుంది. వీటి ఏర్పాటుతో రేషన్ దుకాణాల్లో తూనికలు, కొలతల అక్రమాలకు తెర పడుతుందని, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత వస్తుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా చెప్పారు.