https://oktelugu.com/

RRR Record: ఆర్ఆర్ఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. ఆందోళనలో మూవీ యూనిట్..

RRR Record: ఆర్ఆర్ఆర్ మూవీపై సినీ ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలు మాటల్లో చెప్పలేనవి. ఈ మూవీని దాదాపుగా 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందించారు. అందులోనూ హిట్స్ తప్ప ఫ్లాప్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్. దీనికి తోడు ఇద్దరు పెద్ద హీరోలతో మల్టిస్టారర్.. ఇలా అన్నింటిలో టాప్ ప్లేస్ ను సొంతం చేసుకున్న మూవీ.. తన ఖాతాల్లో మాత్రం ఓ చెత్త రికార్డును వేసుకుంది. మూవీకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నెల 7న మూవీ […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 3, 2022 / 05:44 PM IST
    Follow us on

    RRR Record: ఆర్ఆర్ఆర్ మూవీపై సినీ ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలు మాటల్లో చెప్పలేనవి. ఈ మూవీని దాదాపుగా 400 కోట్లు బడ్జెట్‌తో రూపొందించారు. అందులోనూ హిట్స్ తప్ప ఫ్లాప్ అంటే ఏంటో తెలియని డైరెక్టర్. దీనికి తోడు ఇద్దరు పెద్ద హీరోలతో మల్టిస్టారర్.. ఇలా అన్నింటిలో టాప్ ప్లేస్ ను సొంతం చేసుకున్న మూవీ.. తన ఖాతాల్లో మాత్రం ఓ చెత్త రికార్డును వేసుకుంది. మూవీకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి.

    RRR Record

    ఈ నెల 7న మూవీ థియేటర్స్ లోకి వస్తోంది అని మూవీ యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రమోషన్ సైతం భారీగానే చేశారు. తీరా విడుదల తేదీ దగ్గరకు వస్తుందనగా మూవీ యూనిట్ మరో బాంబ్ పేల్చింది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటం, ఏపీ మూవీ టికెట్ రేట్లపై రచ్చ నడుస్తుండటంతో మూవీని తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది యూనిట్. ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయిన మూవీగా ఆర్ఆర్ఆర్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

    Also Read: ప్రమోషన్స్ కోసం “ఆర్‌ఆర్‌ఆర్” యూనిట్ ఎంత ఖర్చు పెట్టారో తెలుసా ?

    2018లో ఈ మూవీని స్టార్ట్ చేశాడు డైరెక్టర్ రాజమౌళి. షూటింగ్ కాస్త మొదలవగానే కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌ల వల్ల షూటింగ్ లేట్ అయింది. ఎలాగో అలా చిత్రీకరణ పూర్తయిన తర్వాత మరో ఏడాది పోస్ట్ ప్రొడక్షన్ పనులతో గడిచిపోయింది. ఖర్చును లెక్కచేయకుండా క్వాలిటీనే ప్రధానంగా చేస్తూ విజువల్ వండర్‌ను తీసుకురావాలనేది డైరెక్టర్ కల. ఈ మూవీని మొదట 2020 జూలై 30వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ప్రకటించినా అది సాధ్యం కాదని కొందరు అభిప్రాయం సైతం వ్యక్తం చేశారు.

    కానీ ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేస్తామని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 2021 జనవరి 8కి మార్చారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా అక్టోబర్ 13, 2021కి విడుదల తేదీని మార్చారు. ఆ తర్వాత 2022 జనవరి 7న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇప్పుడు సైతం మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది.

    Also Read: ‘భీమ్లా నాయక్’ రావాల్సిందే అంటున్న ఫ్యాన్స్.. సినిమా రిలీజ్ అప్పుడేనా?

    Tags