Pre Release: దర్శక ధీరుడు రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ అంచనాల మధ్య జనవరి 7న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజుకు ముందే భారీ బిజినెస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ సైతం అంతే భారీగా చేస్తోంది. తెలుగు రాష్ట్రాలు మినహా అన్ని ఇండస్ట్రీల్లో ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ఇప్పటికే అదిరిపోయే ప్రమోషన్స్ చేసింది.
ఇదే జోష్ లో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఆ తర్వాత తిరుపతిలో మరో ఈవెంట్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. ఈమేరకు అన్నిరకాల ఏర్పాట్లను చేసుకుంటోంది. తెలంగాణలో ఈనెల 3తేది వరకు ఎలాంటి సభలు, సమావేశాలకు నిర్వహించకూడదనే నిబంధన అమల్లో ఉంది.
Also Read: ‘పుష్ప’ 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !
ఈక్రమంలోనే 4 లేదా 5తేదిల్లో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుక ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ వెంటనే తిరుపతిలో మరో ఈవెంట్ ఉంటుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. విడుదల తేదికి సమయం తక్కువగా ఉండటంతో రెండు ఈవెంట్లు నిర్వహించడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. దీనిపై చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దీనికంటే ముందే తెలుగు మీడియాకు రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వాలని ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషాల్లో అది క్యాన్సిల్ అయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు అసలు ప్రమోషన్ చేసే ఉద్దేశం ఉందా? లేదా అని కామెంట్స్ అభిమానుల నుంచి విన్పిస్తోంది.
మరోవైపు హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరెవరు అతిథులుగా రాబోతున్నారనే చర్చ జోరుగా నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా వస్తారనే ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ ఈ కార్యక్రమానికి వచ్చినా రాకపోయినా మెగాస్టార్ మాత్రం వచ్చే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
ఆ తర్వాత తిరుపతిలో మరో ఈవెంట్ ను ప్లాన్ చేయాలని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి సైతం ఎవరెవరు వస్తారు? అసలు పర్మిషన్ లభిస్తుందా? అనే చర్చ నడుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ముందుగా వేదికలను ఖరారు చేస్తే తప్ప అతిథులు ఫైనల్ అయ్యే అవకాశాలు కన్పించడం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’కు ఈవెంట్లకు ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించడంపై నిర్మాతలు దృష్టిసారిస్తున్నారు.
Also Read: ఏడాదికి 200 కోట్లు.. అందుకే చిరు తెగ కష్టపడుతున్నాడట !