https://oktelugu.com/

Actress Ileana: ఎప్పుడైనా ఇలియానా తల్లిని చూశారా.. ఎంత అందంగా ఉందో!

Actress Ileana: దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొట్టమొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలబడింది. ఇలా ఒకనొక సందర్భంలో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఇలియానాకు క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 30, 2021 / 02:20 PM IST
    Follow us on

    Actress Ileana: దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొట్టమొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి సినిమా తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలబడింది. ఇలా ఒకనొక సందర్భంలో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఇలియానాకు క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.

    Actress Ileana

    ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిన క్రమంలో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘బర్ఫీ’, ‘పటా పోస్టర్ నిఖలా హీరో’, ‘మెయిన్ తెరా హీరో’, ‘రుస్తుం’ వంటి సినిమాల్లో నటించి మంచి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఇలియానాకు ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేవు. అయితే ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియాకు చెందిన ఒక ఫోటోగ్రాఫర్ తో ప్రేమలో ఉందని ఆ ప్రేమలో విఫలం కావడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్లినట్టు స్వయంగా వెల్లడించారు.

    Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

    ప్రస్తుతం ఆ డిప్రెషన్ నుంచి బయటపడిన తర్వాత తిరిగి సినిమాలలో నటించాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఇలియానా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ ఏకంగా తన తల్లితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Also Read: సడన్ గా థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. అభిమానులంతా షాక్?