https://oktelugu.com/

RRR Movie- Larry Karaszewski: సినిమా చచ్చిపోయింది అనేవాళ్ళు RRR చూడండి అంటున్న హాలీవుడ్ రైటర్

RRR Movie- Larry Karaszewski: మన గొప్పలు మనం చెప్పుకుంటే కిక్కేముంది. పక్కనోడు మెచ్చినప్పుడే అది నిజమైన ప్రశంస అవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ పై అమెరికన్ ప్రేక్షకులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఓ అద్భుతం అంటూ అభివర్ణిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పొగుడుతూ అమెరికన్స్ ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ కోసం రాజమౌళి టీమ్ పడ్డ కష్టానికి నిజమైన గుర్తింపు దక్కుతుంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : June 15, 2022 / 02:14 PM IST
    Follow us on

    RRR Movie- Larry Karaszewski: మన గొప్పలు మనం చెప్పుకుంటే కిక్కేముంది. పక్కనోడు మెచ్చినప్పుడే అది నిజమైన ప్రశంస అవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ పై అమెరికన్ ప్రేక్షకులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఓ అద్భుతం అంటూ అభివర్ణిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పొగుడుతూ అమెరికన్స్ ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ కోసం రాజమౌళి టీమ్ పడ్డ కష్టానికి నిజమైన గుర్తింపు దక్కుతుంది. నిజానికి రాజమౌళిని ఆర్ ఆర్ ఆర్ ఇబ్బంది పెట్టినంతగా మరో చిత్రం ఇబ్బంది పెట్టలేదు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి అన్నీ అవాంతరాలే. రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాలపాలయ్యారు. ఈ కారణంగా కొన్నాళ్ళు షూటింగ్ జరగలేదు.

    ఇక కరోనా వైరస్ వ్యాప్తితో నెలల తరబడి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిలిచిపోయింది. రెండేళ్లలో విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్ మూవీ నాలుగేళ్ల సమయం తీసుకుంది. నిర్మాతలు బయ్యర్ల నుండి రాజమౌళి ఒత్తిడి ఎదుర్కొన్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తొణకకుండా ఆర్ ఆర్ ఆర్ తాను అనుకున్నట్లు తెరకెక్కించి మార్చి 25న విడుదల చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి తానేమిటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ దుమ్ముదులిపిన ఆర్ ఆర్ ఆర్ ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. హీరోలు ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ల ఇమేజ్ ప్రపంచ స్థాయికి చేరింది. ఈ ఇద్దరు హీరోల నటనను అభినందిస్తూ అమెరికన్ చిత్ర ప్రముఖులు ట్వీట్స్ వేయడమే దానికి నిదర్శనం.

    Also Read: Sai Pallavi Craze: సాయి పల్లవి అంటే అందరికీ ఎందుకు అంత అభిమానం?

    జూన్ 1న ఆర్ ఆర్ ఆర్ మూవీని అమెరికాలో రీ రిలీజ్ చేశారు. ఎంపిక చేసిన 100 స్క్రీన్స్ లో ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయగా ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంటుంది. అమెరికన్ ప్రేక్షకులు ఈ చిత్రం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అలాగే చిత్ర ప్రముఖులు అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలియజేస్తున్నారు.తాజాగా ఈ లిస్ట్ లో అమెరికన్ రైటర్, ప్రొడ్యూసర్ లారీ కరస్జెవ్స్కీ చేశారు.ఆర్ ఆర్ ఆర్ మూవీకి ఆయనిచ్చిన వన్ వర్డ్ రివ్యూ హాట్ టాపిక్ గా మారింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని లారీ గొప్పగా ప్రశంసించారు.

    RRR Movie

    ”సినిమా చచ్చిపోతుంది అంటున్నవారు ఇంకా ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడ లేదా” అంటూ ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్స్ బీట్ ”నాటు నాటు” వీడియో ట్యాగ్ చేశాడు. ఆర్ ఆర్ ఆర్ లాంటి చిత్రాలు సినిమా గౌరవాన్ని పెంచుతున్నాయన్న అభిప్రాయం ఆయన ట్వీట్ ద్వారా వెల్లడించారు. రైటర్ లారీ ప్రశంస నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్ స్పందించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

    లారీ కరస్జెవ్స్కీ అమెరికన్ క్రైమ్ స్టోరీ (2016), ది పీపుల్ వర్సెస్ లారీ ఫ్లింట్ (1996), ఎడ్ వుడ్ (1994) వంటి రచనలు చేశారు. రచయితగా ఆయనకు అక్కడ మంచి గుర్తింపు ఉంది. ఇక విడుదలైన అన్ని చోట్ల ఆర్ ఆర్ ఆర్ అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో… ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత డివివి దానయ్య రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందించారు. అజయ్ దేవ్ గణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రీయా, సముద్ర ఖని నటించారు.

    Also Read:Pavan Kalyan Worked As Assistant Director: పవన్ కళ్యాణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సినిమా ఏమిటో తెలుసా?

    Tags