Mowgli Trailer Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. పాన్ ఇండియా సినిమాలను చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తిని చూపిస్తున్న క్రమంలో కొంతమంది డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న క్రమంలో యంగ్ హీరోలు సైతం రాణించడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఇక రాజీవ్ కనకాల కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రోషన్ సైతం బాబుల్గం సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఇక ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. కలర్ ఫోటో మూవీతో సూపర్ సక్సెస్ ని సాధించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో ‘మోగ్లీ’ అనే సినిమా చేస్తున్నాడు…ఈ మూవీ ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది…
ట్రైలర్లో క్యారెక్టరైజేషన్ ను పరిచయం చేస్తూ వాడి ప్రేమ ఎలా ఉంటుంది. వాడి ప్రేమను గెలిపించుకోవడానికి ఎలాంటి ఎత్తులు వేస్తున్నాడు. తద్వారా ప్రేమించిన అమ్మాయిని ఎలా గెలుచుకున్నాడు అనేది ఈ సినిమా కథ అంటూ వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఈ సినిమాతో సందీప్ రాజ్ మరో సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది క్లారిటీగా అర్థమవుతోంది. ట్రైలర్లో విజువల్స్ చాలా బాగున్నాయి. బండి సరోజ్ కుమార్ విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది.
ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ గా తెలుస్తోంది. అలాగే హీరో క్యారెక్టరైజేషన్ ని కూడా చాలా బాగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. రాముడు సీత హనుమంతుడు లాంటి వాళ్ళ రిఫరెన్స్ ను కూడా వాడరు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని సాధించి సందీప్ రాజు మరోసారి తన విజయకేతనాన్ని ఎగరవేస్తాడా? లేదా అనేది తెలియాలంటే డిసెంబర్ 12వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి ఇలాంటి స్టోరీలతో చాలా ప్రేమకథలు వచ్చాయి. ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ సినిమాలో కూడా అదే రొటీన్ లవ్ స్టోరీ ని చూపిస్తే మాత్రం సినిమా వర్కౌట్ కాకపోవచ్చు.
సీన్స్ రొటీన్ అయిన ట్రీట్మెంట్ లో ఏదైనా కొత్తదనాన్ని చూపిస్తే తప్ప ఈ సినిమా బయటపడే అవకాశాలైతే లేవు అనేది కూడా తెలుస్తోంది. లవ్ స్టోరీని చేస్తే ప్లస్, మైనస్ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఆ ఫీల్ సరిగ్గా కన్వే సూపర్ సక్సెస్ అవుతోంది. ఒకవేళ లవ్ స్టోరీ కనక ప్రేక్షకులకు నచ్చకపోతే మాత్రం డిజాస్టర్ అవుతోంది. ఇక ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తోంది అనేది తెలియాల్సి ఉంది…