Wife Shock To Husband: నేటి కాలంలో యువతి యువకుల ఆలోచనలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. చదువు, కెరియర్, పెళ్లి, పిల్లల్ని కనడం.. ఇలా అనేక విషయాలలో యువత ధోరణి విచిత్రంగా ఉంటోంది. వారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? ఎలా ఉండబోతున్నారు? భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి? ఇలా అనేక విషయాలలో యువత ధోరణి భిన్నంగా ఉంటున్నది. తల్లిదండ్రుల మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు. స్నేహితుల సలహాయ తీసుకున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే అవకాశం లేదు. ఆ సమయానికి ఏది అనిపిస్తే అదే చేస్తున్నారు. కాకపోతే అదే వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ విషయం అర్థమయ్యేలోపు జరగాల్సిన ఆనర్ధాలు జరిగిపోతున్నాయి.
ఆ యువతి, యువకుడు చదువుకున్నవారు. ఒక స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్థికపరంగా పెద్ద కష్టాలు లేవు. సరిగ్గా వారం క్రితం వారిద్దరికీ వివాహం జరిగింది. అంతకుముందు వారిద్దరూ ప్రతిరోజు ఫోన్లలో గంటలు గంటలు మాట్లాడుకునేవారు. సమయం దొరికితే సరదాగా బయట కలిసేవారు. అలాగని హద్దులు మీరేవారు కాదు. అటువంటి వారిద్దరూ సరిగ్గా వారం క్రితం పెళ్లి చేసుకున్నారు.. వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. బంధువులందరూ ఈ క్రతువుకు హాజరయ్యారు. నూతన దంపతులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. వివాహ వేడుకలో నూతన దంపతులు సందడి చేశారు. ఆడి పాడారు.
ఇటీవల గచ్చిబౌలి ప్రాంతంలో ఓ ఏరియాలో కాపురం కూడా పెట్టారు. ఇంతలోనే ఏమైందో తెలియదు ఆ యువతి ఒక్కసారిగా బయటికి వచ్చింది.. అంతేకాదు భర్తతో విడిపోదామని చెప్పింది.. భార్య మాట్లాడిన ఆ మాటకు భర్తకు ఒక్కసారిగా షాక్ తగిలినంత పనైంది. పెళ్లయివారం కూడా కాలేదు.. అంతలోనే భార్య ఆ మాట అనడం ఆ భర్తకు నచ్చలేదు. ఒక రకంగా చెప్పాలంటే అతని కాళ్ళ కింద భూమి కంపించినంత పనైంది. అయినప్పటికీ భార్యను తన దారులకు తెచ్చుకోవడానికి అతను ప్రయత్నం చేశాడు. అప్పటికి ఆమె మనసు మారలేదు. దానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి అతడు ప్రయత్నించాడు. పదేపదే అతడు ఆమెను ఆ ప్రశ్న అడగడంతో.. దానికి ఆమె “నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏ మాత్రం కూడా కలగడం లేదు. మన ఇద్దరం విడిపోదాం” అని చెప్పింది. దీంతో ఆ భర్త ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. అంతేకాదు ఈ వ్యవహారాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు కూడా ఎంత సర్ది చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఈ సంఘటన నేటి కాలపు పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. యువత ఎలా ఉంటుంది? అలాంటి ఆలోచనలు చేస్తోంది? జీవితం మీద వారికి ఉన్న అవగాహన ఇటువంటిది? ఇలాంటి అనేక ప్రశ్నలకు ఈ యువతి తీరు బలమైన సమాధానం చెబుతోంది.
గచ్చిబౌలిలో ఓ యువతి పెళ్లైన కేవలం వారానికే తన భర్తకు షాకిచ్చింది
నాకు నీ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఇద్దరం విడిపోదాం అంటూ భర్తతో గొడవకు దిగింది
భార్య తీరుతో ఆందోళన చెందిన భర్త ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలనంగా మారింది #Gachibowli #wifeandhusband #incident #RTV pic.twitter.com/otYD3xAae4
— RTV (@RTVnewsnetwork) December 1, 2025