తల్లి తనానికే అవమానం తెచ్చేలా ప్రవర్తించింది ఓ తల్లి. పైగా ఆమె ఒక నటి కూడా. తన కొడుకుతో కలిసి నగ్నంగా ఫొటోకు పోజులిచ్చి.. నీచత్వానికి ప్రతి రూపంలా నిలిచింది. తన కొడుకు 7వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఈ దౌర్భాగ్యపు పని చేసింది. ఆమె తన కొడుకుతో దిగిన నగ్న ఫొటో పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దిగజారుడు చర్య గానూ ఆ నటికి కోర్టు 90 రోజుల జైలు శిక్ష కూడా పడింది. దీంతో ఈ వార్త బాగా వైరల్ అయింది. ఇంతకీ ఈ నీచమైన సంఘటన ఎక్కడ జరిగిందంటే.. ఘనా అనే దేశంలో. ఆ దేశానికీ చెందిన 31 ఏళ్ల నటి రోస్‌మండ్ బ్రౌన్ (Rosemond Brown) అలియాస్ Akuapem Poloo తన ఏడేళ్ల కొడుకుతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది..
మరి ఆ ఒంటరి తనం ఫలితమో ఏమో గానీ, ఆమె తన కొడుకుతో కలిసి నగ్నంగా ఫోటో దిగాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడమే ఆలస్యం, వెంటనే.. నగ్నంగా ఫోటో దిగి ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది కాస్త వివాదస్పదంగా మారింది. ఆ ఫోటోలో ఆ మహిళ తన ఎదను జట్టుతో కప్పుకోగా, కొడుకు మాత్రం లోదుస్తులు ధరించి కనిపించాడు. ఇలా ఏ తల్లి అయినా కొడుకుతో ఫోటో దిగుతుందా ? ఎంత ఒంటరిగా ఉంటే మాత్రం.. కొడుకుతో ఇలా ఎలా ప్రవర్తిస్తోంది ? అంటూ ఆమె పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ఆ విమర్శలు చూసిన రోస్ మండ్ బ్రౌన్ మొత్తానికి ఆ ఫొటోను తన సోషల్ మీడియా ఎకౌంట్ నుండి తొలగించింది. ఫోటో తొలిగించినా ఆమె పై తిట్ల వర్షం మాత్రం ఆగడం లేదు. దాంతో చివరకు ఈ నటి క్షమాపణ కూడా చెప్పింది. తానూ క్షమాపణలు చెప్పాల్సి వచ్చినా.. తనకు ఎలాంటి బాధ లేదని.. అయితే తన కొడుకుతో నగ్నంగా దిగిన ఆ ఫొటోలో అశ్లీలత ఉందని భావిస్తే మాత్రం తానూ కచ్చితంగా బాధ పడతాను అని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా ఈ విషయం కాస్తా కోర్టుకు చేరడం.. ఈ అంశం పై స్పందించిన జడ్జి క్రిస్టినా.. ఇలాంటి నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే సంస్కృతి పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే అంశం అని ఆమెను మందలించాడు. ఆ తర్వాత ఆమెకు బెయిల్ కూడా ఇచ్చాడు ఆ జడ్జి.