కేటీఆర్ కు కరోనా: మంచు లక్ష్మీ హాట్ కామెంట్

తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడి ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. తనకు స్వల్ప లక్షణాలు బయటపడడంతో పరీక్ష చేయించుకున్నానని.. పాజిటివ్ గా వచ్చినట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కేటీఆర్ త్వరగా కోరుకోవాలని ట్వీట్టర్ ద్వారా ఆకాంక్షించారు. ఇక కేటీఆర్ కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు చేశారు. టీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్, […]

Written By: NARESH, Updated On : April 24, 2021 3:48 pm
Follow us on

తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడి ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటున్న విషయం తెలిసిందే. తనకు స్వల్ప లక్షణాలు బయటపడడంతో పరీక్ష చేయించుకున్నానని.. పాజిటివ్ గా వచ్చినట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కేటీఆర్ త్వరగా కోరుకోవాలని ట్వీట్టర్ ద్వారా ఆకాంక్షించారు.

ఇక కేటీఆర్ కోలుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు చేశారు. టీఆర్ఎస్ నేతలంతా కేసీఆర్, కేటీఆర్ బాగు కోసం యజ్ఞాలు, యాగాలు కూడా కొన్ని చోట్ల మొదలుపెట్టారు.

ఇక కేటీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంపై సినీ ప్రముఖులంతా ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోలుకోవాలని కోరారు. అయితే డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు, ప్రముఖ నటి మంచు లక్ష్మీ మాత్రం కాస్త వెరైటీగా స్పందించారు.

మంచు లక్ష్మీ ట్వీట్ చేస్తూ ‘కేటీఆర్ త్వరగా కోలుకో.. నేను నటించిన అన్ని సినిమాలు ఈ ఐసోలేషన్ టైంలోనే చూడండి’ అని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం మంచులక్ష్మీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేటీఆర్ అనారోగ్యంతో బాధపడుతుంటే సమయం సందర్భం లేకుండా నా సినిమాలు చూడు అని మంచు లక్ష్మీ అనడంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆమెకు కౌంటర్లు ఇస్తున్నారు. నువ్వు తీసిన సినిమాలే కొన్ని అని.. వాటిలో హిట్ అయినవి వేళ్ల మీద లెక్కపెట్టవచ్చని ఈ టైంలో అలాంటి సినిమాలు చూస్తే ఊన్న రోగం ఎక్కువ అవుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఇక బడ్డీ ఏంటమ్మా… రాష్ట్ర మంత్రిని పట్టుకొని అలా కామెంట్ చేశావని కొందరు.. ఇక మంచు లక్ష్మీ సినిమాలు చూసి కేటీఆర్ మూర్చపోతారని కొందరు కామెంట్లలో మీమ్స్, సెటైర్లు పెడుతూ హోరెత్తిస్తున్నారు.

ఇక కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తాజాగా కేటీఆర్ కు కూడా చికిత్స అందిస్తున్నాడు. వైరస్ లక్షణాలు స్వలంగా ఉన్నాయని.. కేటీఆర్ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వివరించారు.

https://twitter.com/LakshmiManchu/status/1385560743739727873?s=20

https://twitter.com/aditya_duvvala/status/1385601380912566276?s=20