Homeఎంటర్టైన్మెంట్Romantic: ఓటీటీలో స్ట్రీమింగ్​ కానున్న రొమాంటిక్​.. రిలీజ్​ ఎప్పుడంటే!

Romantic: ఓటీటీలో స్ట్రీమింగ్​ కానున్న రొమాంటిక్​.. రిలీజ్​ ఎప్పుడంటే!

Romantic: మాస్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​ తనయుడు ఆకాశ్​ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్​. లవ్​స్టోరీ, గ్యాస్​స్టర్​ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్​గా నటించిన కేతిక శర్మ కూడా టాలీవుడ్​లో అభిమానులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు అనిల్​ పాదూడి దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్​ , ఛార్మి ఈ సినిమాను నిర్మించారు.

romantic

ఈ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా రెబల్​ స్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు రొమాంటిక్ సినిమాకు సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే విడుదలకు ముందు ఈ సినమాపై పూరి భారీ హైప్​ క్రియేట్​ చేశారు.  ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆకాశ్​ తన నటనతో ఇరగదీశాడని.. పూరి తనయుడిగా తన మార్క్​ను చూపించాడని అన్నారు.  రొమాంటిక్​, యాక్షన్​ సన్నివేశాలతో సినిమా ఎంతో బాగుంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్​ అయ్యేందుకు రెడీ అవుతోంది.

ప్రస్తతం ఓటీటీ రంగంలో దూసుకెళ్లిపోతున్న వాటిల్లో ఆహా ఒకటి. మిలియన్ల సబ్​స్క్రైబర్లను సొంతం చేసుకుని.. ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లో అగ్రగామిగా నిలిచేందుకు పోటీ పడుతోంది. కాగా, రొమాంటిక్​ సినిమాను ఆహాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అక్టోబరు 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను.. ఓటీటీలో నవంబరు 29న స్ట్రీమింగ్​ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటనకూడా విడుదల చేసింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో చూడలేని వారందా ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version