Roja Daughter Anshu: 90లలో స్టార్ గా సౌత్ ని ఊపేసింది తెలుగు అమ్మాయి రోజా. ఆమె తెలుగు కంటే తమిళంలో ఎక్కువ ఆదరణ దక్కించుకోవడం విశేషం. ఆ తరం టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో ఆమె జతకట్టారు. అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రోజా సక్సెస్ అయ్యారు. కొన్ని చిత్రాల్లో విలన్ గా నెగిటివ్ రోల్స్ చేశారు. ఇక రెండు దశాబ్దాల క్రితమే రోజా పొలిటికల్ జర్నీ స్టార్ట్ అయ్యింది. 1999 లో రోజా టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదన్న నెపంతో కాంగ్రెస్ పార్టీకి మారారు.
వైఎస్ జగన్ వైఎస్సార్ సీపీ స్థాపించగా రోజా జాయిన్ అయ్యారు. ఆ పార్టీ తరపున నగరి నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సీఎం జగన్ క్యాబినెట్ లో మంత్రిగా చేస్తున్నారు. ఇక జబర్దస్త్ జడ్జిగా దాదాపు దశాబ్దం కాలం ఉన్న రోజా కొన్ని నెలల ముందు బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. మంత్రి పదవి రావడంతో రోజా నిబంధనల ప్రకారం జబర్దస్త్ వీడాల్సి వచ్చింది. 2013 నుండి రోజా జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా వ్యవహరించారు.
Also Read: Ram Charan- Jr NTR Enter Politics: రాజకీయాల్లోకి ఎన్టీఆర్, రామ్‌చరణ్.. పోటీ ఎక్కడి నుంచంటే?
కాగా రోజా తన కూతురిని హీరోయిన్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారట. ఆమె తెరంగేట్రానికి రంగం సిద్దమైందట. రోజాకు ఒక అమ్మాయి, అబ్బాయి. కూతురు అన్షు మాలిక టీనేజ్ లో ఉన్నారు. అందంలో అమ్మకు ఏమాత్రం తీసిపోని అన్షు వెండితెరపై రాణించాలని అనుకుంటున్నారట. అన్షు సినిమా రంగం పట్ల ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో రోజా ప్రోత్సహించాలని అనుకుంటున్నారట.
కొన్నాళ్లుగా రోజా కూతురు అన్షు హీరోయిన్ కానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా హీరో పేరు కూడా తెరపైకి వచ్చింది. కోలీవుడ్ స్టార్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ కి జంటగా అన్షు నటించనున్నారట. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయట. త్వరలో అధికారిక ప్రకటన ఉంటుంది, అంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఇది బైలింగ్వల్ మూవీ అయ్యే అవకాశం కలదంటున్నారు. ఇక రోజా భర్త సెల్వమణి దర్శక నిర్మాతగా ఉన్నారు. రోజా-సెల్వమణి ప్రేమ వివాహం చేసుకున్నారు .
Also Read: KCR- ST Reservations: ఆ జీవో వస్తే నోటిఫికేషన్లకు బ్రేక్.. కేసీఆర్ నిర్ణయం నిరుద్యోగులకు శాపం!
Recommended videos: