Roja; ప్రస్తుత కాలంలో ఒక షో పదేళ్ల పాటు విజయవంతంగా ప్రదర్శించబడటం తేలిక కాదు. అయితే జబర్దస్త్ షో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సక్సెస్ ఫుల్ గా ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతోంది. ఈ షో మొదలైనప్పటి నుంచి రోజా ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే. మల్లెమాల నిర్వాహకుల వల్ల రోజా ఈ షోకు జడ్జిగా వ్యవహరించగా ఈ షోకు మొదట్లో రోజా తక్కువగానే పారితోషికం తీసుకునేవారు.
ఈ షో ద్వారా రోజా దాదాపుగా మూడు కోట్ల రూపాయల వరకు సంపాదించారని సమాచారం అందుతోంది. రెండేళ్ల క్రితం వరకు రోజాకు తక్కువ మొత్తం రెమ్యునరేషన్ దక్కగా ఆ తర్వాత ఒక్కో ఎపిసోడ్ కు లక్షల్లోనే రోజా రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. రోజా ఈ షో ద్వారా తనకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చిందనే భావనను కలిగి ఉండటం వల్ల ఈ షోకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు.
రోజా కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నా ఈ షో ద్వారానే ఆమెకు భారీ మొత్తంలో ఆదాయం దక్కింది. నగరి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు పాలిటిక్స్ లో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆమె అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. రోజా సినీ కెరీర్ కు , జబర్దస్త్ కు దాదాపుగా దూరమైనట్టేనని తెలుస్తోంది.
రోజాకు ప్రాధాన్యత ఉన్న శాఖ దక్కి ఉంటే మరింత బాగుండేదని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రోజా ఎంతోమంది కష్టాల్లో ఉన్నవాళ్లకు సాయం చేస్తూ మంచి మనస్సును చాటుకుంటున్నారు.
Recommended Videos: