Disha Act in AP: మహిళలపై దారుణాలు, ఆకృత్యాలు పెరుగుతున్నాయి. రోజుకో ఘటన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఆడపిల్ల బయటకు వెళితే సురక్షితంగా తిరిగొస్తుందనే నమ్మకం లేకుండా పోతోంది. అడుగడుగునా అత్యాచారాలు, పూటకో వేధింపులు ఫలితంగా సగటు మహిళ బతుకు అగమ్యగోచరంగా మారుతోంది. కంటికి రెప్పలా కాపాడతామని చెబుతున్న ప్రభుత్వాలు నిర్లక్ష్యంగానే ఉంటున్నాయి. దీంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ముక్కుపచ్చలారని బతుకులు తెల్లారిపోతున్నాయి. అయినా నిందితులకు శిక్ష పడిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.

హైదరాబాద్ లో దిశ ఘటన జరిగినప్పుడు ఏపీ సీఎం మొసలి కన్నీరు కార్చారు. ఆమెకు జరిగిన అన్యాయానికి సంతాపాన్ని ప్రకటించారు. తమ రాష్ట్రంలో ఆడవారిపై ఈగ కూడా వాలనివ్వనని అక్కడ దిశ చట్టం తెచ్చారు. కానీ దాని అమలు మాత్రం మరిచారు. దీంతో ఇప్పుడు అభాసుపాలవుతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న మహిళలపై నేరాల సంఖ్య చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ప్రభుత్వం ఉందా లేదా వారితోనే ఈ పనులు చేయిస్తుందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: Roja: జబర్దస్త్ షో ద్వారా రోజా అన్ని రూ.కోట్లు సంపాదించారా.. రెమ్యునరేషన్ ఎంతంటే?
దిశ చట్టం, యాప్, పోలీస్ స్టేషన్లు, కేసులు అంటూ హడావిడి చేసిన ఏపీ ప్రభుత్వం తరువాత కాలంలో అన్ని మరిచిపోయింది. ప్రస్తుతం మహిళలపై నేరాల సంఖ్య ఎక్కువవుతోంది. గుంటూరులో ఓ చిన్నారిని చిదిమేస్తే.. అనంతపురంలో ఓ బ్యాంకు ఉద్యోగిని హత్య చేసి కాల్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రోజు ఏదో ఓ ఘటన వెలుగు చూస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది. వారికి సహాయం చేస్తుందా? వారిని అక్కున చేర్చుకుంటుందా అనే సందేహాలు వస్తున్నాయి. దీంతో వ్యవస్థపైనే అసహ్యం వేస్తోందని పలువురు చెబుతున్నారు.

మీట నొక్కితే మీ ముందుంటాం అని చెప్పిన వారు ఏమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న మారణహోమాలకు సమాధానం ఎవరు చెబుతారు? బాధితులకు న్యాయం ఎవరు చేస్తారు? ఇదంతా చేయాల్సింది ప్రభుత్వం కాదా? ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకోవడం తెలుసు కానీ మహిళలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో జరిగితే ఓ విధంగా సొంత రాష్ట్రంలో జరిగితే మరో విధంగా స్పందించడమెందుకు? చట్టం పటిష్టంగా అమలు చేస్తే బాధితులకు అన్యాయం జరగదు కదా అని అందరు వాదనలు చేస్తున్నారు.
Also Read:Telangana Movement: ఆమరణ దీక్షలో బాత్రూంలో కూర్చొని కేసీఆర్ ఇడ్లి తిన్నాడు.. సాక్ష్యముందట!
Recommended Videos