Bigg Boss 6 Telugu Rohit-Merini: తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లాంచ్ అయ్యింది. కింగ్ నాగార్జున చేతుల మీదుగా 6వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఓ పేకమీడల మధ్యలో నాగార్జునను నిలబెట్టి.. బిగ్ బాస్ థీమ్ ను ప్రజెంట్ చేస్తూ షోను మొదలుపెట్టారు. బ్యాక్ గ్రౌండ్ లో కమలాసన్ ‘విక్రమ్’ మూవీ మ్యూజిక్ వస్తుండగా.. విదేశీ సుందరాంగుల మధ్యలో నుంచి నాగార్జున బయటకొచ్చి ‘బంగార్రాజు’ పాటకు స్టెప్పులేసి బిగ్ బాస్ 6ను లాంచ్ చేశారు.

పోయిన సారి సెట్ కంటే ఈసారి కాస్తా కలర్ ఫుల్ గా బిగ్ బాస్ హౌస్, సెట్ వేశారు. ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డా 6, ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డా ఫిక్స్ అంటూ నాగార్జున మొదట బిగ్ బాస్ ఇంటిని వెరైటీగా చూపించారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ను ఒక పాట రూపంలో వినూత్నంగా ఆవిష్కరించారు. హౌస్ మాత్రం ఎంతో అందంగా ముస్తాబు చేశారు. డైనింగ్ హాల్, స్విమ్మింగ్ ఫూల్, గార్డెన్ ఏరియా సహా అన్నింటిని కలవ్ ఫుల్ గా డిజైన్ చేశారు. చూస్తుంటేనే ఆహ్లాదకరంగా ఇది ఉంది. ఈసారి ఎంటర్ టైన్ మెంట్ అదిరిపోయేలా కనిపిస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లోకి తొలి కంటెస్టెంట్ గా సీరియల్ యాక్టర్ ‘కీర్తి’ అడుగుపెట్టింది. ఇక సెకండ్ కంటెస్టెంట్ గా నువ్వు నాకు నచ్చావ్ లో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా నటించిన ‘పింకి’ ఎంట్రీ ఇచ్చింది. ఈమె అసలు పేరు సుదీప. ఇక మూడో కంటెస్టెంట్ గా యూట్యూబర్ ‘శ్రీహాన్’ ఎంట్రీ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్ గా నేహా అడుగుపెట్టింది. ఇక ఐదో కంటెస్టెంట్ గా జబర్ధస్త్ కమెడియన్ చలాకీ చంటీ ఎంట్రీ ఇచ్చాడు. 6వ కంటెస్టెంట్ గా సింగర్, మోడల్ శ్రీ సత్య ఎంట్రీ ఇచ్చింది. 7వ కంటెస్టెంట్ గా అర్జున్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. 8వ కంటెస్టెంట్ చిత్తూరు జిల్లాకు చెందిన యూట్యూబర్ గీతూ ఎంట్రీ ఇచ్చింది. ఈమెను లేడీ ‘పుష్ప’గా పిలుస్తుంటారు.ఈమె చిత్తూరు యాసలో ఇరగదీస్తుంటుంది. 9వ కంటెస్టెంట్ గా ఐటెం బాంబ్, నటి అభినయశ్రీ ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లోకి 10వ కంటెస్టెంట్లుగా జోడీ రోహిత్-మెరినీ ఎంట్రీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరు హైదరాబాద్ లో కలుసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. సినిమాల్లో నటిస్తుండగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం పలు సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం సీరియల్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు ఒక కార్డును తీయగా.. అది ‘బ్లాంక్ కార్డుగా’ వచ్చింది. దాని కథేంటో హౌస్ లోకి వెళ్లాక చెబుతానంటూ 10వ కంటెస్టెంట్లుగా ఈ జోడీని ఇంటిలోకి నాగార్జున పంపించారు.