Bigg Boss telugu 8 Rohini : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ. లాంచింగ్ ఈవెంట్ ద్వారా పరిచయమైన 14 మంది సెలెబ్స్ లో విష్ణుప్రియకు ఉన్న పాపులారిటీ మరొకరికి లేదు. దాంతో ఆమె టైటిల్ ఫేవరేట్ అనే ప్రచారం జరిగింది. కానీ ఆ అంచనాలు విష్ణుప్రియ నిలబెట్టుకోలేకపోయింది. విష్ణుప్రియ ఫస్ట్ వీక్ నుండే కంటెస్టెంట్ పృథ్విరాజ్ తో సన్నిహితంగా ఉండేందుకు ఇష్టపడేది. అయితే పృథ్వికి సోనియా ఆకుల దగ్గరైంది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు. పృథ్విరాజ్ ఆమె చెప్పినట్లు వినేవాడు.
విష్ణుప్రియకు సోనియా ఛాన్స్ ఇచ్చేది కాదు. దాంతో ఒకింత నిరాశ చెందేది. సోనియా ఆకుల 4వ వారం ఎలిమినేట్ అయ్యింది. సోనియా నిష్క్రమణతో విష్ణుప్రియకు లైన్ క్లియర్ అయ్యింది. అతడికి దగ్గర కావడం మొదలుపెట్టింది. పృథ్వి మాత్రం ఏమంత ఆసక్తి చూపేవాడు కాదు. సందర్భం ఉన్నా లేకున్నా పృథ్విని హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టడం చేసేది. మెల్లగా పృథ్వి కూడా అట్రాక్ట్ అయ్యాడు.
విష్ణుప్రియతో కనెక్షన్ ఉందన్న కామెంట్స్ ని ఎంజాయ్ చేసేవాడు. ఏకంగా గేమ్ వదిలేసిన విష్ణుప్రియ పృథ్వి కోసమే హౌస్ కి వెళ్లినట్లు ప్రవర్తించింది. అయితే ఇదంతా నిజమేనా అనే సందేహాలు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్లో ప్రేమలు నిజం కాదు. అక్కడ దగ్గరైన జంటల్లో ఒక్క జంట కూడా కలిసి ఉంది లేదు. హౌస్ నుండి వచ్చిన వెంటనే లేదంటే… రెండు మూడు నెలల తర్వాత ఎవరి దారి వారిది. నిఖిల్-మోనాల్, ఆర్జే సూర్య-ఇనాయ సుల్తానా, రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అభిజీత్-హారిక, షణ్ముఖ్-సిరి హన్మంత్.. బిగ్ బాస్ ప్రేమ జంటలు.
వీరందరూ విడిపోయారు. ఈ క్రమంలో విష్ణుప్రియ-పృథ్వి రిలేషన్ పై కూడా అనుమానాలు ఉన్నాయి. శనివారం ఎలిమినేటైన రోహిణిని బిగ్ బాస్ బజ్ హోస్ట్ అర్జున్ అంబటి… విష్ణుప్రియ-పృథ్వి మధ్య ఉన్నది కనెక్షనా లేక కంటెంట్ నా? అని అడిగారు. నాకు వారి మిత్రులు చెప్పిన దాని ప్రకారం అదే కనెక్షన్ అని రోహిణి సమాధానం చెప్పింది. కంటెంట్ కొరకు కాదు, నిజంగానే ఇద్దరు మానసికంగా దగ్గరయ్యారని రోహిణి వెల్లడించారు.
దీనిపై క్లారిటీ రావాలంటే… కొద్దిరోజులు వెయిట్ చేయాలి. 13వ వారం పృథ్వి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ అట. రోహిణి శనివారం ఎలిమినేట్ కాగా. నేడు పృథ్వి బిగ్ బాస్ ఇంటిని వీడనున్నాడట. అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఫైనలిస్ట్స్ అట.