LIC Scholarship : చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా.. ఆర్థిక పిరిస్థితులు సహకరించక ప్రతిభ ఉన్న అనేక మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపకార వేతనాలు అందిస్తున్నాయి. పలు కార్పొరేట్ సంస్థలు కూడా సోషల్ రెస్పాన్స్‌లో భాగంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తున్నాయి. ఆర్థిక సాయం చేస్తున్నాయి. తాజాగా ఈ రంగంలోకి భారత జీవితబీమా సంస్థ కూడా చేరింది. ఇందుకోసం ప్రత్యేకంగా గోల్డెన్ జూబ్లీ స్కారల్‌షిప్ స్కీం పేరిట పథకం తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందిస్తుంది. ఈమేరకు ఇటీవలే ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో అర్హులు, దరఖాస్తు తేదీ తదితర వివరాలు పేర్కొంది.
అర్హులు వీరే..
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీంకు 2021–22, 2022–23, 2023–24 అకడమిక్ ఇయర్‌లో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా లేదా తత్సమాన కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పూర్తి వివారాల కోసం జ్టి్ట https://www.licindia.in/ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. దరఖాస్తు తేదీ డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 22 వరకు ఉంది.
ఉన్నత చదువులు కోసమే..
టెన్త్, ఇంటర్, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసమే ఈ స్కాలర్‌షిప్ అందిస్తుంది. 2024–25లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అనర్హులు. స్కాలర్‌షిప్ పొందేవారు మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఏదైనా డిప్లొమా చేయాలనుకుంటేనే స్కాలర్‌షిప్ మంజూరు చేస్తారు. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ స్కీం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి రెండేళ్లు స్కారల్‌షిప్ ఇస్తారు.