Hansika divorce news: బాలనటిగా కెరీర్ ని ప్రారంభించి, అతి చిన్న వయస్సులోనే హీరోయిన్ గా మారి, తెలుగు తమిళ భాషల్లో అగ్ర హీరోల సరసన నటిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ హన్సిక(Hansika Motwani). ఈమె మన తెలుగు ఆడియన్స్ కి ‘దేశముదురు’ అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. కానీ అంతకు ముందు ఆమె హిందీ లో హృతిక్ రోషన్ హీరో గా నటించిన ‘కోయి మిల్ గయా’ అనే చిత్రం లో బాలనటిగా నటించింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో బాలనటిగా నటిస్తూ కమర్షియల్ యాడ్స్ లో కూడా ఈమె చిన్నతనం లో బాగానే కనిపించింది. ఇక ఆ తర్వాత ‘దేశముదురు’ చిత్రం తో హీరోయిన్ గా కెరీర్ ని మొదలు పెట్టి తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.
Also Read: అనసూయ అలాంటి ఫోటోలు పెట్టేది అందుకే… సోషల్ యాక్టివిస్ట్ షాకింగ్ ఆరోపణలు
తెలుగు లో ఈమె చేసిన సినిమాల సంఖ్య తక్కువే, కానీ హన్సిక అంటే ఇప్పటికీ మన కుర్రాళ్లలో మంచి క్రేజ్ ఉంటుంది. ఇకపోతే ఈమె 2022 వ సంవత్సరం, డిసెంబర్ నెలలో సోహైల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది. సోహైల్ గొప్ప వ్యాపారస్తుడు, ఆయనకు వందల కోట్ల ఆస్తి ఉంది. కానీ హన్సిక కి ఆ రేంజ్ ఆస్తులు లేవు. ఈ ఒక్క అంశం హన్సిక కుటుంబం తో అతనికి సమస్య అయ్యిందని, వీళ్ళ మధ్య విబేధాలు ఏర్పడి విడిపోయే పరిస్థితికి వచ్చిందని, త్వరలోనే వీళ్లిద్దరు విడిపోబోతున్నారని, ఇలా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. వీటిపై హన్సిక ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఆమె భర్త సోహైల్ మాత్రం సోషల్ మీడియా ద్వారా అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఆయన నోరు విప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: అది నాని డెడికేషన్… మేటర్ తెలిస్తే ఫ్యాన్ అయిపోతారు!
ఆయన మాట్లాడుతూ ‘నేను హన్సిక అనాధికారికంగా విడిపోయామని, వేర్వేరుగా ఉంటున్నామని పలు సోషల్ మీడియా చానెల్స్, మీడియా మిత్రులు వార్తలను ప్రచారం చేస్తున్నారు. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. అభిమానులు దయచేసి ఇలాంటివి నమ్మకండి. మెమ్మేమిద్దరం ఎంతో సంతోశావంతమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే వార్తలు, సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను ఎలా డిస్టర్బ్ చేస్తుందో మీరే చూడండి. సోహైల్ ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కానీ ఇవ్వాల్సి వచ్చిందంటే, ఆయన వద్దకు ఈ వార్త వెళ్లి ఎంత ఇబ్బంది పెట్టి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎన్ని విధాలుగా కంట్రోల్ చెయ్యాలని చూసినా, ఈ సోషల్ మీడియా లో ఇలాంటి వార్తలు ఆగడం లేదు. ప్రభుత్వాలు స్వయంగా చర్యలు చేపడితే తప్ప, సోషల్ మీడియా లో ఎలాంటి మార్పులు తీసుకొని రాలేము.