Robin Hood : హీరో నితిన్(Nithin) పరిస్థితి ప్రస్తుతం వర్ణనాతీతం గా ఉంది. ‘భీష్మ’ చిత్రం తర్వాత వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్న ఆయన, ‘రాబిన్ హుడ్'(Robinhood Movie) చిత్రం బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. భీష్మ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల నే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కాబట్టి కచ్చితంగా ఈ సినిమాలో విషయం ఉంటుందని ట్రేడ్ బలంగా నమ్మింది. అందుకే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ బిజినెస్ భారీ రేట్స్ కి జరిగాయి. కానీ థియేటర్స్ లో ఈ చిత్రానికి మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ రావడంతో ఫుల్ రన్ లో కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టలేక చతికిల పడింది. కనీసం ఓటీటీ లో అయినా మంచి రెస్పాన్స్ ఈ చిత్రం దక్కించుకుంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా కష్టమే.
Also Read : ‘రాబిన్ హుడ్’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..నితిన్ మారకపోతే కష్టమే!
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ‘జీ5’ సంస్థ కొనుగోలు చేసింది. మొదట్లో భారీ రేట్ కి డీల్ కుదిరింది. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ముందు అనుకున్నంత రేట్స్ ఇప్పుడు ఇవ్వలేమని, మాకు వర్కౌట్ అవ్వదని, తక్కువ రేట్స్ కి ఇస్తేనే కొనుగోలు చేస్తామని, లేదంటే డీల్ క్యాన్సిల్ చేసుకుంటామని మైత్రీ మూవీ మేకర్స్ తో అన్నారట. ఇప్పటికే ఆ సినిమాకు 75 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేశామని, థియేటర్స్ నుండి నష్టాలు వచ్చాయి, ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా నష్టం తెచ్చుకోవాలని అనుకోవడం లేదని, ముందు అనుకున్న అగ్రిమెంట్ నే అనుసరించాలని మైత్రీ మూవీ మేకర్స్ కూడా తగ్గడం లేదట. దీంతో జీ5 సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే రాబిన్ హుడ్ ని మరో ఓటీటీ లో కూడా చూడలేము.
ఎందుకంటే ఈ సంవత్సరానికి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సంస్థల స్లాట్స్ అన్ని నిండిపోయాయి. విడుదల చేయాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. పాపం నితిన్ సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. ప్రస్తుతం నితిన్ వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ తో ‘తమ్ముడు’ అనే చిత్రం చేస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. జులై నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారట. కనీసం ఈ సినిమాతో అయినా నితిన్ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.
Also Read : ‘రాబిన్ హుడ్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..ఎపిక్ డిజాస్టర్!