https://oktelugu.com/

Kamal Hasaan- Allu Arjun : కమల్ హాసన్ చేతిలో అల్లు అర్జున్ కవర్ ఫోటో..ఆయన సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన రేంజ్ నుండి ఈ స్థాయికి!

Kamal Hasaan- Allu Arjun :

Written By:
  • Vicky
  • , Updated On : March 6, 2025 / 07:52 PM IST
    Kamal Hasaan- Allu Arjun

    Kamal Hasaan- Allu Arjun

    Follow us on

    Kamal Hasaan- Allu Arjun : నేటి తరం యువత ఏ రంగం లో ఉన్న వాళ్ళైనా సరే, ఆదర్శంగా తీసుకొని పైకి ఎదిగేంత రోల్ మోడల్స్ లో ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). చిరంజీవి(Megastar Chiranjeevi) మేనల్లుడిగా, అల్లు అరవింద్(Allu Aravind) కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ని చూసి కెరీర్ ప్రారంభం లో ఎంత అవహేళన చేసేవారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా ఎన్నో అవమానాలు ఎదురుకున్న హీరో, నేడు దేశం మొత్తం అమితంగా ఇష్టపడే హీరోలలో ఒకడిగా మారిపోయింది. పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ కి సరికొత్త బెంచ్ మార్క్ తానే అని నిరూపించి చూపాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి రాజమౌళి తర్వాత అంతటి బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న సెలబ్రిటీ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అలాంటి గురించి నేడు మన దేశం లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు.

    Also Read : 14వ పెళ్లి రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్-స్నేహ.. వీరి క్రేజీ లవ్ స్టోరీ తెలుసా? సినిమాలకు మించిన ట్విస్ట్స్

    అందుకు ఉదాహరణ న్యూయార్క్ సిటీ లో అత్యంత ప్రజాధారణ పొందిన ‘హాలీవుడ్ రిపోర్టర్'(Hollywood Reporter) అనే వార పత్రిక, మన ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టగా, మొట్టమొదటి కవర్ పేజీ మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫోటో ని ప్రచురించింది. ‘అల్లు అర్జున్ – ది రూల్’ అనే టైటిల్ తో ప్రచురింపబడ్డ ఈ మ్యాగజైన్ ని తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన కమల్ హాసన్(Kamal Hassan) చేతుల మీదగా నిన్న విడుదల చేయించారు. దేశం ఎంతో గర్వించదగ్గ హీరోలలో ఒకరైన కమల్ హాసన్, నేటి తరం సూపర్ స్టార్స్ లో ఒకరైన అల్లు అర్జున్ గురించి ఒక అంగ్ల మీడియా ప్రచురించిన వార పత్రికని లాంచ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. కమల్ హాసన్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు. నటనలో ఆయనొక నిఘంటువు. అలాంటి వ్యక్తి చేతుల మీదుగా ఇది లాంచ్ అవ్వడం, అల్లు అర్జున్ సాధించిన అద్భుత విజయాల్లో ఒకటి అనొచ్చు.

    గతంలో అల్లు అర్జున్ కమల్ హాసన్ హీరో గా నటించిన ఒక సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు అనే విషయం మీకు తెలుసా..?, కానీ అది నిజంగానే జరిగింది. కమల్ హాసన్, కె విశ్వనాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘స్వాతి ముత్యం’ చిత్రం లో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్టుగా, కమల్ హాసన్ మనవడిగా నటించాడు. కమల్ కెరీర్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన చిత్రమది. అలాంటి సినిమాలో అల్లు అర్జున్ నటించడం కూడా ఒక అరుదైన అదృష్టమే. ఆ సినిమా చిన్న పిల్లాడిగా కనిపించిన అల్లు అర్జున్, నేడు ఇంతటి స్థాయికి ఎదుగుతాడని, తనని మించి స్టార్ స్టేటస్ ని సంపాదిస్తాడని కమల్ హాసన్ అసలు ఊహించి కూడా ఉండదు. అలాంటి రేంజ్ కి చేరుకున్నాడు మన ఐకాన్ స్టార్.

    Also Read : నెల రోజుల పాటు అల్లు అర్జున్ స్పెషల్ ట్రైనింగ్..దేనికోసం ఇంత కష్టం? అయోమయంలో పడిన ఫ్యాన్స్!